Hyderabad: రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలి పారు. యూపీఎస్సీ మెయిన్స్ 2025 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. సివిల్స్ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుం బీకులకు అండగా నిలిచేందుకు గత ఏడాది రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది కూడా ఈ పథకం కింద సింగరేణి సంస్థ అధ్వర్యంలో 202 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది.
Read Also: Indiramma illu News : జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇందిరమ్మ హౌస్ పథకం నిలిచినట్టే?
రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 43 మంది తాజాగా యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాల్లోనూ విజేతలుగా నిలిచారు. రాష్ట్రం నుంచి మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. వీరందరికీ గతేడాది మాదిరిగా ఈసారి కూడా ఇంటర్వ్యూలకు సన్నద్ధం అయ్యేందుకు మరో లక్ష రూపాయల ప్రోత్సాహకం అందించనున్నారు. సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం ద్వారా లబ్ధి పొందిన 43 మంది మెయిన్స ఎంపిక కావడం అభినందనీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గత ఏడాది ఈ పథకాన్ని ప్రారంభించగా ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 342 మంది తెలంగాణ యువత 3.62 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని సింగరేణి సంస్థ ద్వారా పొందారని తెలిపారు. నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడంలో భాగంగా సివిల్స్ మెయిన్స్, ఇంటర్వూలకు ఎంపికిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించి ప్రతి దశలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు.

Hyderabad: ఈ పథకం కింద ఈ సంవత్సరం మెయిన్స్కు ఎంపికైన 202 మంది >>2 సివిల్స్ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక ప్రోత్సహాన్ని అందించామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందులో 43 మంది విద్యార్థులు సివిల్స్ లక్ష్యానికి చేరువ కావడం అభినందనీయం అన్నారు. 43 ఇంటర్వ్యూకు ఎంపిక కావడం ఆనందాన్ని కలిగిస్తోంది, ఇంటర్వ్యూ కు ఎంపికైన 43 మంది విద్యార్థులకు మరో లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తాము. ఆర్థిక సహాయంతో పాటు ఢిల్లీలో వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తామ న్నారు. నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడానికి ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని సివిల్స్ మెయిన్స్ ఫలితాల సందర్భంగా మరోమారు నిరూపితమైందన్నారు.
గొప్ప సంకల్పంతో 2024 లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయానం పథకాన్ని ప్రారంభించగా మొదటి సంవత్సరం 140 మంది మెయిన్స్కు ఎంపికయ్యారు, అందులో 20 మంది ఇంటర్వ్యూకు ఎంపిక కాగా అందులో ఏడుగురు సివిల్ సర్వీసెస్ సాధించి వివిధ హోదాల్లో స్థిరపడడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థిక సింగరేణి, గర్వకారణంగా సహకారం అందించిన భావిస్తున్నాయన్నారు. 2వ సంవత్సరంలో భాగంగా మెయిన్స్కు ఎంపికైన 202 మందికి ఆర్థిక సహకారం అందించగా అందులో 43 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారని వివరించారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 3.62 కోట్ల రూపాయల ఆర్థిక సాయం తెలంగాణ యువతకు అందించామని తెలిపారు.
తెలంగాణ యువత కలలను సాకారం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద ప్రోత్సాహకం అందుకున్న 43 మంది అభ్యర్థులు సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని సింగరేణి కాలరీస్ సిఎండి బలరాం నాయక్ పేర్కొన్నారు. విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా యువతకు ఆర్థిక అవరోధాలు లేకుండా, వారి కలలను సాకారం చేసేందుకు ప్రారంభించిన ఈ పథకం రెండో ఏడాది కూడా మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: