हिन्दी | Epaper
క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు

Independence Day : గోల్కొండకు త్రివర్ణ శోభ, పంద్రాగస్టుకు భారీ ఏర్పాట్లు

Shravan
Independence Day : గోల్కొండకు త్రివర్ణ శోభ, పంద్రాగస్టుకు భారీ ఏర్పాట్లు

హైదరాబాద్ : స్వతంత్ర దినోత్సవ (Independence Day) ఏర్పాట్లు ఘనంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గోల్కొండ కోటను సందర్శించి వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను ఉన్నత అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు.

గోల్కొండ కోటలో ముఖ్య కార్యక్రమాల సమీక్ష

చారిత్రక గోల్కొండ కోటలో ముఖ్యమంత్రిచే జాతీయ జెండా (National flag) ఆవిష్కరణ, పోలీసుల గౌరవ వందనం అలాగే అభివృద్ధి సంక్షేమ పథకాల సందేశం తదితరాంశాలపై చర్చించారు. అతిధులకు ఎక్కడ కూడా ఇబ్బందులు, ఆసౌకర్యం కలగకుండా వేడుకలు అత్యంత ఘనంగా, గౌరవప్రదంగా నిర్వహించబడాలని, ముఖ్యంగా ప్రోటోకాల్, భద్రత, ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

పోలీసు సిబ్బందికి పతకాలు మరియు మార్చ్ పాస్ట్ సమీక్ష

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతిభావంతమైన పోలీసు సిబ్బందికి పతకాలు ప్రదానం చేసే కార్యక్రమం, గార్డ్ ఆఫ్ ఆనర్, మార్చ్ ఫాస్ట్ తీరును సమీక్షించారు.

వర్షాల  ఏర్పాట్లు

వాతావరణ సూచనల ప్రకారం వర్షాల నేపథ్యంలో ముందస్తుగా ప్రాధాన్యత ఇవ్వాలని, వాటర్ ప్రూఫ్ షెడ్లు, మెడికల్ క్యాంపులు, గ్యాలరీలు, సీటింగ్ కెపాసిటీ, బారికెట్స్ అలాగే వాటర్ ప్రూఫ్ జనరేటర్, పబ్లిక్ ఆడ్రెస్ సిస్టమ్స్, ఎల్ఈడి స్క్రీన్ల ఏర్పాట్లపై సంబంధిత అధికారులు సీఎస్ కి వివరించారు. ప్రోటోకాల్ తప్పక పాటించాలని, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలు, ఈ ప్రాంతంలో ప్రజలు సులభంగా రాకపోకలు సాగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

Independence day

అవసరమైన సదుపాయాలపై ఆదేశాలు

వేడుకల సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా, త్రాగునీటి అందుబాటు, పారిశుద్ధం, వైద్య సిబ్బంది, ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు అందుబాటులో ఉండాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. వేడుకలు ఎటువంటి అంతరాయం లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆదేశించారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్రావు, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డిజిపి డాక్టర్ జితేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఐఅండ్ పిఆర్ కమిషనర్ హెచ్. ప్రియాంక, అదనపు డీజీపీ మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్, అదనపు పోలీస్ కమిషనర్ (లా ఆర్డర్) వి.ఎస్. మాన్, డిజి ప్రిజన్స్ సౌమ్య మిశ్రా, డిజి ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి, ప్రోటోకాల్ డైరెక్టర్ శివలింగయ్య, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, విద్యుత్, జిహెచ్ఎంసి, ప్రోటోకాల్, రెవెన్యూ, హెచ్ఎండిఏ, సీనియర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/mother-tongue-like-mothers-milk-is-a-symbol-of-national-culture/hyderabad/530207/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870