హైదరాబాద్ : అలంపూర్ జోగులాంబ టెంపుల్ను సమగ్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో జోగు లాంబ ఆలయ మాస్టర్న్ పై ఎండోమెంటు ఉన్నతాధికారులతో మంత్రి సురేఖ, సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎండోమెంటు డిపార్టు మెంటు ప్రిన్స్ పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ వెం కటరావు, తెలంగాణ ధార్మిక్ అడ్వజర్ గోవిం ద హరి తదితరులు పాల్గొన్నారు. ఈ సం దర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ జోగు లాంబ ఆలయాల అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు వివరించారు. కృష్ణ తుంగభద్ర నదు ల సంగమ ప్రాంతంలో జోగులాంబ శక్తి పీఠం ఉందని ఈ టెంపుల్ ప్రగతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో భక్తులు, సం దర్శకులు, పర్యాటకులు పెద్దసంఖ్యలోనే వచ్చి నా ఆ మేరకు నిర్మాణ ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశిం చారు. ఈ టెంపుల్ను మూడు విడతల్లో అభివృద్ధి (Development) చేస్తున్నామని, మొత్తం రూ.382.5కోట్లతో అభి వృద్ధి చేపడుతున్నట్టు తెలిపారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Goldsmiths : స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి