Drugs: డ్రగ్స్ లేని నగరంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల సరఫరాలు అడ్డుకట్టపై కఠిన చర్యలు తీసుకుంటున్నది. యువతను రక్షించేందుకు టీజీ ప్రభుత్వం తనవంతు కృషి చేస్తున్నది. పోలీసులు ఎప్పటికప్పుడు నిఘాను పెంచి, వీటిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా పోలీసుల కళ్లుగప్పి, డ్రగ్స్ సరఫరాను కొనసాగిస్తున్న ముఠాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ను ముంబై పోలీసులు ఛేదించారు. ఓ రసాయన ఫ్యాక్టరీ(Chemical factory) ముసుగులో మాదకద్రవ్యాలు తయారు చేస్తున్న ఈ ముఠా గుట్టును రట్టుచేసి, సుమారు రూ.12.000 కోట్ల విలువైన ఎండీ (మెథెడ్రోన్) డ్రగ్సను, ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.

ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు
మహారాష్ట్రకు(Maharastra) చెందిన మీరా-భయందర్, వసాయి-విరార్ (ఎంబివివి) పోలీసులు కొన్నాళ్లుగా ఓ డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో తమ గుఢాచారులను రంగంలోకి దించి వారాల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ముఠా మూలాలు హైదరాబాద్ లోని చర్లపల్లిలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ఫ్యాక్టరీపై మెరుపుదాడి చేశారు. ‘వాఘేవి ల్యాబ్స్’ అనే నకిలీ లైసెన్స్ నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలో అత్యాధునిక పరికరాలతో భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
పోలీసుల అదుపులో 12మంది
ఈ దాడిలో ఫ్యాక్టరీ యజమాని, రసాయన నిపుణుడైన శ్రీనివాస్ తోపాటు అతని సహచరుడు తానాజీ పాఠే, ఓ విదేశీయుడు సహా మొత్తం 12మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ప్రాథమికంగా 100 గ్రాముల ఎండీ డ్రగ్స్, రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీలో జరిపిన సోదాలలో డ్రగ్స్ తయారీకి వినియోగించే సుమారు 32,000 లీటర్ల రసాయనాలతోపాటు, భారీ ఉత్పత్తి యూనిట్లను కూడా సీజ్ చేశారు. ఈ ఫ్యాక్టరీ నుంచి తయారైన మాదకద్రవ్యాలను మహారాష్ట్రతో పాటు అనేక ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంతపెద్ద నెట్వర్క్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. బడాబాబుల అండదండలతో ఇలాంటి అసాంఘిక వ్యాపారాలను యదేచ్చంగా కొనసాగిస్తుండడం గమనార్హం. అక్రమంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న ఇలాంటి ముఠాలను ఎంత కఠినంగా శిక్షించినా తక్కువే. ప్రత్యేకంగా ఎంతో ఉజ్వల భవిత ఉన్న యువత విద్యార్థి దశలోనే మత్తుపదార్థాలకు గురై తమ జీవితాలను అంధకారంలో పడేసుకుంటున్నారు. అందుకే పోలీసులు తల్లిదండ్రులకు హెచ్చరికలు చేస్తుంటారు. మీ పిల్లలపై నిరంతరం ఓ కన్నేసి ఉంచండి అని.
హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసు ఎందుకు వార్తల్లో నిలిచింది?
ఇటీవల పెద్దఎత్తున డ్రగ్స్ స్వాధీనం కావడం, పలువురు ప్రముఖులు, యువత ఈ కేసులో పేర్లు వినిపించడం కారణంగా వార్తల్లో నిలిచింది.
పోలీసులు డ్రగ్స్ ఎక్కడ దొరికించుకున్నారు?
హైదరాబాద్‌లోని పలు ప్రదేశాల్లో ప్రత్యేక దాడులు చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Read also: