Crime News: జీవితం అందమైనది మాత్రమే కాదు విలువైనది కూడా. దేవుడు మనకు ఇచ్చిన ఈ జీవితాన్ని అనేకులకు ఆదర్శంగా జీవించాలి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు, కేన్సర్, కిడ్నీ వంటి పెద్ద జబ్బులతో బాధపడుతున్న వారు తాము బతకాలని ఎంతగా తపిస్తుంటారో మనం గమనించే ఉంటాం. ఏవిధంగానై బతికి బట్టకట్టాలని కఠినమైన ట్రీట్మెంట్ లకోసం పాటుపడుతుంటారు. వారిని చూస్తే అనిపిస్తుంది జీవితం ఎంత విలువైనదో. అందంగా లేనని, ఆర్థిక సమస్యలు ఉన్నాయని, కుటుంబ సమస్యలు ఉన్నాయని, కెరీర్ఎదగలేకపోతున్నామని చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలకు (suicide) పాల్పడుతున్న వారి సంఖ్య ఇటీవల పెరగడం విచారకరం. ఎందుకు ఇదంతా చెబుతున్నారని అనుకుంటున్నారా? అయితే మీరే చదవండి ఈ వార్తను.

ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబం
హైదరాబాద్ లోని మియాపూర్(Miyapur) లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో అత్త, మామ, భర్త, భార్య, రెండేళ్ల చిన్నారి ఉన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియదు. ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా లేక ఇతర కారణాలు ఏమై ఉన్నాయో పోలీసులు విచారిస్తున్నారు. ఒకేసారి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు, ఇరుగుపొరుగు వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిన్నటి వరకు తమతో ఆనందంగా పలకరించిన కుటుంబం ఇలా విగతజీవులుగా మారడం తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వారికున్న కష్టాలు ఏకొద్దిగానైనా తమతో పంచుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బంధువులు వాపోతున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో ఏమి బయటపడింది?
పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం, ఇది ఆత్మహత్యే కావచ్చని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల మరణానికి మరే ఇతర వ్యక్తులు కారణమై ఉంటారన్న ఆధారాలు ప్రస్తుతానికి లేవు. పూర్తి నిజాలు దర్యాప్తులో తేలనున్నాయి.
ఆత్మహత్యలకు కారణం ఏమిటి?
ప్రస్తుతం ఆత్మహత్యలకు స్పష్టమైన కారణం తెలియరాలేదు. పోలీసులు ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఇతర వ్యక్తిగత కారణాల కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ MORE: