హైదరాబాద్ : తెలంగాణలో(Telangana) విజిలెన్స్అధికారులు(Vigilance officers) విసృతంగా నల్లగొండ, వరంగల్, కరీంనగర్ ఉమ్మడిజిల్లాలలో పరిధిలో దాడులు రైస్ మిల్లులు, మైనింగ్ అక్రమరవాణ వాహనాలపై దాడులు నిర్వహించి ఆయా శాఖల అధికారులకు వాటిని అప్పగించి కేసులు నమోదు చేయడానికి సిఫార్సులు చేశారు. రైసుమిల్లులో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో సుమారు రూ.40 కోట్లమేరకు కస్టమ్మిల్లు ధాన్యం మిల్లుల నిల్వ చేయకుండా చీకటి బజారుకు తరలించినట్ల అధికారులు గుర్తించారు, నల్లగొండ జిల్లా కెతెపల్లి మండలం, ఉప్పలపహడ్ గ్రామం లోని మెస్సర్స్ చాముండేశ్వరి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో, మిల్లర్ రబీ సీజన్ 2022-23కి సంబంధించిన 1,39, 671.86 క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యాన్ని దారిమళ్లించినట్లు గుర్తించారు.
Read Also: Kompally:చిట్టీల పేరిట ఆర్ఎంపి వైద్యుడు కోట్లాది రూపాయల మోసం

దారిమళ్లించిన ధాన్యం విలువ రూ.28 కోట్ల, 88లక్షల,41వేల,696 ఉంటుందని నిర్ధారించారు. మిల్లర్పై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ పౌర సరఫరాల శాఖకు ఒక అభ్యర్థన సమర్పించారు., వరంగల్ యూనిట్లోని విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు హనుమకొండ జిల్లా కమలాపూర్ వద్ద ఒక ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కమలాపూర్కు చెందిన తోడేటి రాజు అనే వ్యక్తి చుట్టుపక్కల గ్రామస్థుల నుండి సేకరించిన 100 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని వరంగల్ విజిలెన్స్ అధికారులు పట్టుకొన్నారు. వీటివిలువ రూ.3,90,000 ఉంటుంది. బియ్యం నూకలుగా రూపాంతంచేసి ఎపి 36 ఎక్స్ 9537 అనే డిసిఎం వాహనంలో రవాణా చేస్తున్నాడని అధికారులు పేర్కొన్నారు. తదుపరి చర్యల కోసం రెస్పాండెంట్ను పిడిఎస్ బియ్యం వాహనంతో పాటు డిటి(సిఎస్) కమలాపూర్కు అప్పగించారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్(Telangana) మండలం పెద్దాపాపయ్యపల్లి గ్రామంలోని మెసర్స్ శ్రీ రవిచంద్ర ఇండస్ట్రీస్ వద్ద ఆకస్మిక దాడులు నిర్వహించారు. మిల్లర్ రబీ 2022-23, 2024-25 సీజన్లకు సంబంధించిన 32207.8 క్వింటాళ్ల కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) స్టాక్లను, రూ. 6.68 కోట్లు విలువైన దాన్ని దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. మిల్లర్పై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ పౌర సరఫరాల శాఖకు ఒక అభ్యర్థన చేశారు. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలం, బోర్నపల్లి గ్రామంలోని విజయ కృష్ణ మోడరన్ రైస్ మిల్లుపై ఆకస్మిక దాడి నిర్వహించి, రైస్ మిల్లు యజమాని (లీజ్ హోల్డర్) వేముల మనోహర్ వద్ద పిడిఎస్ బియ్యం స్వాధీనం చేసుకొన్నారు శంకరపట్నం మండలం లింగాపూర్కు చెందిన పద్మశాలి వేముల మనోహర్ నుండి రూ.8,34,400/ విలువైన 238.40 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని విజిలెన్స్ అధికారులు ప్రకటిం చారు.
హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండలం, పంగిడిపల్లి గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి నుండి మనోహర్ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. మిల్లర్పై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ పౌర సరఫరాల శాఖకు ఒక అభ్యర్థన ఇవ్వబడింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నల్గొండ యూనిట్ ద్వారా ఆకస్మిక మార్గ తనిఖీ శుక్రవారం తెల్లవారుజామున చేశారు. నల్గొండ యూనిట్ అధికారులు గనులు, వాణిజ్య పన్నులుశాఖ ఆర్ఎ శాఖల అధికారులతో కలిసి యాదాద్రిభోంగిర్ జిల్లాలోని చౌటుప్పల్ టోల్ గేట్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ఆకస్మిక మార్గ తనిఖీ నిర్వహించి, వాహనాలను అడ్డగించి 11 కేసులను మోటారు వాహనాల చట్టం కింద, (2) కేసులను గనుల చట్టం కింద, (2) కేసులను జీఎస్టీ చట్టం కింద నమోదు చేశారు. మొత్తం విధిం చిన పన్ను సుమారు రూ.4,45,518/ జరిపమానా విధించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: