Student suicide : హయత్‌నగర్ హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య.. పోలీసులు దర్యాప్తు ప్రారంభం హైదరాబాద్ నగర శివార్లలోని హయత్‌నగర్‌లో (Student suicide) ఓ హాస్టల్‌లో 21 ఏళ్ల డిప్లొమా విద్యార్థి అనిల్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల సమాచారం ప్రకారం, అనిల్‌కుమార్ హయత్‌నగర్‌లోని ఒక కాలేజీలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అక్కడే ఉన్న ఒక ఐటీ హాస్టల్‌లో వసతి తీసుకుని ఉండేవాడు.
బుధవారం సాయంత్రం అతడు గదిలో ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే సహచరులు అతడిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మరణించినట్లు ప్రకటించారు.

పోలీసులు కేసు నమోదు చేసి మరణానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు.
Read also :