హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతి ప్రాంగణంలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubramanyam) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 15న జరగనుంది.
Read Also: Rajinikanth: శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్
తదితరులు హాజరు
ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరు కానున్నారు.

అదేరోజు 4PMకు సినీ సంగీత స్వరనీరాజనం ఉంటుందని సంస్థ అధ్యక్షుడు అచ్యుత రామరాజు తెలిపారు. ఎంట్రీ పాసుల కోసం 14న 3PMకు రవీంద్ర భారతిలో కౌంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇటీవల బాలు (SP Balasubramanyam) విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: