భారతీయ జీవిత బీమా సంస్థ సికింద్రాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో సౌత్ సెంట్రల్ జోనల్ అథ్లెటిక్స్ అండ్ వాలీబాల్ క్రీడా పోటీ (South Central Zonal Athletics and Volleyball Sports Competition) లు 2025 ప్రారంభోత్సవ వేడుకలు రైల్వే రిక్రియేషన్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ సికింద్రాబాద్లో (Secunderabad) ఈరోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

క్రీడా పోటీలకు
ఈ కార్యక్రమానికి సౌత్ సెంట్రల్ జోన్, జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ జండా వందనం గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జీవిత బీమా సంస్థ (Life Insurance Company of India) లో క్రీడా పోటీలకు ప్రాముఖ్యత ఇస్తారని కేవలం శారీరక వ్యాయామం కాకుండా మానసిక సంతులన కూడా సాధించి సంస్థకు మెరుగైన సేవలను పాలసీదారులకు అందిస్తున్నారని తెలిపారు.

తదితరులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిషనల్ మేనేజర్ G.మధుసూదన్, మేనేజర్ (పర్సనల్) శాంతి ప్రియ, ఉమాదేవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ హెచ్ ఎస్ చంద్రశేఖర్, స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు మెంబర్స్ జే. సురేష్, శర్మ తదితరులు పాల్గొన్నారు ఈ పోటీలు 28 మరియు 29 తేదీలలో జరుగుతాయి. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు రేపు బహుమతులు అందజేస్తారు.

హైదరాబాద్ మొదటి నగరం ఏది?
హైదరాబాద్ నగరం తొలి దశలో భాగ్యనగర్ అని పిలవబడింది. ఇది ముహమ్మద్ కులీ కుతుబ్ షా స్థాపించిన నగరం.
సికింద్రాబాద్‌లో పేరుగాంచిన సరస్సు పేరు ఏమిటి?
సికింద్రాబాద్‌లో ప్రసిద్ధమైన సరస్సు పేరు హుస్సేన్ సాగర్ (Hussain Sagar).
Read Hindi News : hindi.vaartha.com
Read also : Shubman Gill: తీవ్ర ఒత్తిడిలో మా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు