హైదరాబాద్: వచ్చే ఏడాది ఆగస్టు రెండవ తేదీన ఖగోళంలో అద్భుతం కనువిందు చేయనుంది. ఈ శతాబ్దపు అతిపెద్ద సంపూర్ణ సూర్యగ్రహణం (solar eclipse) ఆ రోజున పట్టపగలు ఏర్పడనుంది. ఆరు నిమిషాల 23 సెకన్ల పాటు సూర్యుడు పూర్తిగా చంద్రుడి ఛాయలో వెళ్లనున్నాడు. దీని కారణంగా సంపూర్ణ గ్రహణం ఏర్పడే దేశాలలో అంధకారం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం మరో వంద సంవత్సరాల తరువాతే ఏర్పడుతుందని వారంటున్నారు.
Read Also: Telangana: తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025

గ్రహణం కనిపించే ప్రాంతాలు
మొదటగా అట్లాంటిక్ మహా సముద్రంలో ఏర్పడనున్న ఈ సూర్యగ్రహణం ఆ తరువాత యూరప్ తో పాటు మొరాకో, అల్జీరియా, తునీషియా, లిబియా, ఈజిప్ట్, మధ్య ఆసియా, దక్షిణ అమెరికా(America) దేశాలలో కనిపించనుంది. బ్రెజిల్ దేశం ఈ అద్భుత సంపూర్ణ సూర్యగ్రహణ వీక్షణకు వేదిక కానుంది. ఈ దేశంలోని రెండు చోట్ల సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించడంతో ఆ ప్రాంతంలో అప్పుడే సందడి మొదలయ్యింది.
భారతదేశంలో వీక్షణ, గ్రహణ ప్రత్యేకతలు
భారత్ వరకు వస్తే ముంబాయి, రాజస్థాన్‌లోని జైసల్మేర్, గుజరాత్‌లోని భుజ్ ప్రాంతాలలో పాక్షికంగా కనిపించనుంది. ఈ మూడు నగరాలలో మధ్యాహ్నం 3:34 గంటల నుంచి సాయంత్రం 5:53 గంటల వరకు కొద్ది నిమిషాల తేడాతో గ్రహణం కనిపించనుంది. హైదరాబాద్ వరకు వస్తే కొంత అస్పష్టంగా ఈ గ్రహణం సాయంత్రం 3:58 గంటల నుంచి సాయంత్రం 5:33 గంటల వరకు కనిపించనుంది.
సాధారణంగా ప్రతీ 18 నెలలకు ఒకసారి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అన్ని సూర్యగ్రహణాలు సంపూర్ణ సూర్యగ్రహణాలుగా ఉండవు. ఇక సంపూర్ణ సూర్యగ్రహణాలు కూడా మూడు నుంచి ఐదు నిమిషాల వరకే పరిమితమవుతాయి. కానీ ఆగస్టు రెండవ తేదీ నాటి సంపూర్ణ సూర్యగ్రహణం ఆరు నిమిషాల 23 సెకన్ల పాటు ఉండనుంది. ఇంత సుదీర్ఘ సూర్యగ్రహణం సంభవించడం గడచిన 123 ఏళ్లలో ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈసారి సంభవించనున్న సంపూర్ణ సూర్యగ్రహణం జ్యోతిష్య పండితులతో పాటు వాతావరణ హెచ్చుతగ్గులను పరిశీలించే శాస్త్రవేత్తలకు, జంతువుల విపరీత ప్రవర్తనపై పరిశోధన చేసే జంతు శాస్త్రవేత్తలకు సాధనంగా ఉండనుంది.
వచ్చే ఏడాది సుదీర్ఘ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది?
ఆగస్టు 2న.
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఎంత సమయం పాటు ఉంటుంది?
ఆరు నిమిషాల 23 సెకన్ల పాటు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: