ప్రైవేట్,(private,) కార్పొరేట్ పాఠశాలల మాదిరిగానే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులు బడికి హాజరు కానట్లయితే వారి తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపనున్నారు. అయితే, ప్రైవేట్ స్కూళ్లలో రోజువారీగా కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కనీసం మూడు, నాలుగు రోజులు బడికి రాకపోతే ఈ ఎస్ఎంఎస్ పంపనున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా మీ అబ్బాయి/అమ్మాయి పాఠశాలకు హాజరు కావడం లేదు, కారణం ఏమిటి? అని ఈ ఎస్ఎంఎస్ లో తెలుసుకోనున్నారు. ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26,120 పాఠశాలల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు.

విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుపై పర్యవేక్షణ
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(Recognition system) (SRS)ని అమలు చేస్తున్నారు. సుమారు 16.70 లక్షల మంది విద్యార్థుల్లో దాదాపు 90 శాతం మంది ఈ SRSలో నమోదు చేసుకున్నారు. దీని ద్వారా ప్రతిరోజూ విద్యార్థుల హాజరు తీసుకుంటున్నారు. ఈ ఎస్ఎంఎస్ విధానం వల్ల విద్యార్థులు బడి ఎగ్గొట్టకుండా పాఠశాలకు హాజరవుతున్నట్లు, హాజరు శాతం పెరుగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సూచనల మేరకు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు(corporate schools) ధీటుగా మార్చడానికి ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టింది. వీటిలో భాగంగా, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్య కోర్సుల్లో కూడా 75% హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్ మెంట్, పరీక్షలకు అనుమతి ఇస్తున్నారు. పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయుల హాజరును SRS ద్వారా తీసుకుంటుండటంతో వారి హాజరు శాతం కూడా పెరిగింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు గైర్హాజరైతే తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ ఎప్పుడు వెళుతుంది?
విద్యార్థులు కనీసం మూడు, నాలుగు రోజులు పాఠశాలకు హాజరు కాకపోతే ఎస్ఎంఎస్ వెళుతుంది.
ఈ ఎస్ఎంఎస్ విధానం ఎక్కడ అమలు చేస్తున్నారు?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు
చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: