సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగర వాసులకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పండుగకు స్వస్థలాలకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ భద్రత అంశాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా నగరాన్ని విడిచి వెళ్లే కుటుంబాలు తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.
Read also: HYD: మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా లొంగుబాటు.. పార్టీకి గట్టి షాక్

Sankranti Festival
స్వస్థలాలకు వెళ్లే ముందు సమీప పోలీస్ స్టేషన్ లేదా బీట్ ఆఫీసర్‌కు తెలియజేయాలని సీపీ సజ్జనార్ (v.c sajjanar) సూచించారు. ప్రయాణ సమయంలో నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని, వాటిని బ్యాంకు లాకర్లలో లేదా సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచాలని ఆయన తెలిపారు. దొంగతనాల నివారణకు, నేరాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి కాల్ చేయాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: