హైదరాబాద్: తెలంగాణలో పోలీసు సంస్కరణల అమలుకు సైబరాబాద్, సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో 30 పోలీసు స్టేషన్లను ఎంపిక చేశారు. ఇందుకు గానూ ఇండియన్ పోలీసు ఫౌండేషన్ (ఐపిఎఫ్) (IPF) ప్రతినిధులతో డిజిపి జితేందర్ సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు గత ఆగస్టు నెలలో సర్కారు ఆమోదం తెలపగా దీనిని సోమవారం అధికారికంగా ఆమోదముద్ర వేశారు. ఐపిఎఫ్ను ఢిల్లీలో 2014లో మేఘాలయ మాజీ డిజిపి రామచంద్రన్ స్థాపించగా ఆ తరువాత దేశ వ్యాప్తంగా దీని విస్తరణ జరిగిందని డిజిపి జితేందర్ ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో పోలీసు సంస్కరణలను వేగంగా అమలు చేయడంతో పాటు, ప్రజలతో పోలీసు శాఖ మమేకం అవడంతో పాటు ప్రజలకు మరింత భద్రత కల్పించడం,దీని లక్ష్యమని ఆయన తెలిపారు.
మరింత విశ్వాసం పెరుగుతుందని
ఐపిఎఫ్ట్లో విశ్రాంత సీనియర్ ఐపిఎస్ (IPS) అధికారులతో పాటు విద్యావేత్తలు, పరిశోధ కులు, బ్యూరోక్రాట్లు వుంటారని, వీరంతా ఒక బోర్డు కింద పనిచేస్తారని డిజిపి తెలిపారు. పోలీసు సంస్కరణల అమలు ద్వారా ప్రజలకు పోలీసుల పై మరింత విశ్వాసం పెరుగుతుందని ఆయన తెలిపారు. తెలంగాణాలో ఇప్పటికే అమలవుతున్న మీ సేవ, క్యూఆర్ కోడ్ వ్యవస్థ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, మహిళల కోసం టి.సేఫ్ వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని ఆయన అన్నారు. పోలీసు సంస్కరణలకుగానూ సైబరాబాద్, సంగారెడ్డి (Sangareddy) లో 30 పోలీసు స్టేషన్లను ఎంపిక చేశామని ఆయన తెలిపారు. ఐపిఎఫ్ అధ్యక్షుడు విశ్రాంత డిజి ఓం ప్రకాష్ మాట్లాడుతూ పరి శోధన, సామర్ధ్యాభివృద్ధి, విధాన రూపకల్పన ద్వారా పోలీసింగ్ను మెరుగు పరచడం తమ లక్ష్యమని తెలిపారు.

డాక్టర్ ఈష్ కుమార్ మాట్లాడుతూ
ఇప్పటికే ఐపిఎఫ్ హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, కేరళ, ఉత్తరప్రదేశ్లో విభాగాలను ఏర్పాటు చేసిందని ఇప్పుడు తెలంగాణ (Telangana) లో ఏర్పాటవుతుందని ఆయన తెలిపారు. ఐపిఎఫ్ ఉపాధ్యక్షుడు, ప్రాజెక్టు డైరక్టర్ డాక్టర్ ఈష్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా పౌరుల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించడం, (Sangareddy) మహిళల భద్రత, ప్రజలు కోరుకున్నట్లుగా పోలీసింగ్ ఏర్పాటడం, పోలీసుల కోసం మంచి వాతావరణ కల్పించడం ముఖ్యంగా వున్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ఏడాది పాటు నిర్వహించిన తరువాత స్వతంత్ర సంస్థ ద్వారా పరిశీలన చేయిస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల అదనపు డిజి మహేష్ భగవత్, పర్సనల్ విభాగం అదనపు డిజి అనిల్ కుమార్, ఐపిఎఫ్ ప్రతినిధులు కోడె దుర్గా ప్రసాద్, శరత్ కుమార్, ఐజిలు చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు..
తెలంగాణలో పోలీసు సంస్కరణల కోసం ఎక్కడ పైలట్ ప్రాజెక్టు చేపట్టారు?
A: సైబరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని 30 పోలీసు స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టు చేపట్టారు.
ఈ ప్రాజెక్టు కోసం ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు?
A: ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (IPF) ప్రతినిధులతో డీజీపీ జితేందర్ ఒప్పందం కుదుర్చుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: