పోలీసులంటే ప్రజలకు రక్షణగా ఉండాలి. ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి. నిస్సహాయులకు ఆపన్నహస్తం అందించాలి. ఎక్కడైనా ఎప్పుడైనా ప్రజల భద్రతే పోలీసుల విధికర్తవ్యం. అలాంటి పోలీసులు నేరస్తులకు అండగా ఉంటే వారిని ఏం చేయాలి? వృత్తిధర్మానికి హానిచేసేవారు ఎవరైనా వారిపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. ఇలాంటి చర్యే సీపీ సజ్జనార్(CP Sajjanar) సార్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: Supreme Court: వీధి కుక్కల కేసులో రాష్ట్రాల సీఎస్‌లపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఆర్థిక నేరస్తుడిని వదిలేసిన ఎస్ఐ
రూ.3వేల కోట్ల ఆర్థిక నేరం చేసిన నిందితుడిని పోలీసులు ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు యత్నించారు. అయితే మార్గంలోనే ఆ నిందితుడితో టాస్క్ ఫోర్స్(Task Force) ఎస్ఐ శ్రీకాంత్ రూ. 2కోట్లు డీల్ కుదుర్చుకున్నాడు. ఆ రెండు కోట్లు తీసుకుని, నిందితుడిని వదిలేశారు. ఎస్ఐ శ్రీకాంత్ ఆ డబ్బును పై అధికారులకు ఇచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సీపీ సజ్జనార్ ఎస్ ఐ శ్రీకాంత్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు సీపీ సజ్జనార్.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: