హైదరాబాద్‌లోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున దోపిడీ(Robbery) జరిగిన ఘటన వెలుగుచూసింది. గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న కెప్టెన్ గిరి (75) ఇంట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంటి పనులు చూసే నేపాల్‌కు చెందిన ఉద్యోగి, మరికొందరితో కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
Reasd Also: Karimnagar Crime: పిల్లలపై కన్నతండ్రి దాడి, కూతురు మృతి
దాడి, దోపిడీ – నమ్మకాన్ని వాడుకున్న పనివాడు
పోలీసుల సమాచారం ప్రకారం, ఆ నేపాలీ ఉద్యోగి ముందుగానే ప్లాన్ చేసి తన ముఠాలోని మరో నలుగురిని ఇంట్లోకి అనుమతించాడు. తర్వాత వారు గిరిపై కర్రలతో దాడి(Robbery) చేసి, చేతులు కట్టేసి నిర్వీర్యం చేశారు. బీరువాను బలవంతంగా పగులగొట్టి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదులో, దుండగులు 25 తులాలకు పైగా బంగారం మరియు రూ.23 లక్షల నగదు సహా మొత్తం రూ.50 లక్షలకు పైగా ఆస్తి తీసుకెళ్లినట్లు పేర్కొంది. సూచన అందుకున్న కార్ఖానా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఇంటి పనివాడి వివరాల ఆధారంగా కేసు దర్యాప్తును వేగవంతం చేసి, నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: