హైదరాబాద్ Power : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గిపోయింది. ప్రస్తుత 2025-26 సంవత్సరానికి అంచనా వేసిన డిమాండ్ కంటే తక్కువగా రికార్డు అయింది. ప్రస్తుత సీజనులో 277 గిగావాట్ల గరిష్ట స్థాయికి విద్యుత్ డిమాండ్ చేరుకుంటుందని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అయితే అడపాదడపా వర్షాలు కురుస్తుం డటంతో విద్యుత్ వినియోగంలో తగ్గుదల చోటు చేసుకుంది. వచ్చే నెల సెప్టెంబర్ నాటికి గరిష్టంగా 277 గిగావాట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతుందని అంచనా వేసిన మంత్రిత్వ శాఖ అందుకు అనుగుణంగా స్వల్పకాలిక, దృక్పథ ప్రణాళికలను రూపొందించింది. అయితే ఈ అంచనా కంటే తక్కువగా 242 గిగావాట్ల మేర విద్యుత్ డిమాండ్ రికార్డయింది. గత ఏడాది ఇదే కాలానికి 250 గిగావాట్ల చొప్పున విద్యుత్ వినియోగం జరిగి, అది ఆల్ టైమ్ హైగా కేంద్రం గుర్తించింది. ఈ లెక్కన ప్రస్తుత సంవత్సరం అంచనా వేసిన విద్యుత్ కాదుకదా, గత ఏడాది డిమాండ్ కంటే 8 గిగావాట్ల విద్యుత్ తక్కువగా నమోదు కావడం విశేషం. అంతకు ముందు ఏడాది 2023 సెప్టెంబర్ వరకూ 243.27 గిగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్, జూలైతో పాటు, ఈ నెలలో ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

కాగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 427 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన కేంద్రాలు ఉండగా, దాన్ని 2030 నాటికి 900 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి పెంచేందుకు ప్రతిపాదనలు చేస్తోంది. వీటితో పాటు, 500 గిగావాట్ల (Gigawatts) నాన్ ఫాసిల్ విద్యుత్ సామర్థ్యాన్ని వ్యవస్థాపించే దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే గత నెలాఖరు నాటికి 187.5 గిగావాట్ల మేర నాన్ ఫాసిల్ ఇంధన వనరుల నుండి విద్యుత్ ఉత్పతి సాధించింది. ఇదే సమయంలో విద్యుత్ రంగాన్ని సంస్కరించే లక్ష్యంతో గ్రీన్ హైడ్రోజన్ తయారీ వంటి ఇటెన్సిష్ పరిశ్రమలకు ఇంధన భద్రతను పెంచే లక్ష్యంతో కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తోంది. అలాగే విద్యుత్ మెరుగుదలను పెంపొందించే విస్తృత వ్యూహంలో భాగంగా విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :