ఆగస్టు 29 నుంచి ప్రారంభమైన కౌన్సెలింగ్
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్ సెట్-2025 కౌన్సెలింగ్లో భాగంగా సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు రేపు(గురువారం) ప్రకటించనున్నారు. ఎడ్ సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ (Counseling) ఆగస్టు 29 నుంచి ప్రారంభించారు. గత నెల 29 నుంచి ఈ నెల 2 వరకు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకొని, సర్టిఫి కెట్ వెరిఫికేషన్కి అవకాశం కల్పించారు.

వారిలో 9955 మందికి సీట్ల కేటాయింపు చేశారు.
అర్హులైన అభ్యర్థుల లిస్టును ఈ నెల 4న ప్రకటించగా వారికి ఈ నెల 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్లకి అవకాశమిచ్చారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారికి రేపు(గురువారం) సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందినవారు ఈ నెల 12 నుంచి 16 వరకు ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బిఈడి (BED) కాలేజీల్లో 14,295 కన్వీనర్ కోటాసీట్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి విడతలో 17,151 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా వారిలో 9955 మందికి సీట్ల కేటాయింపు చేశారు.
Read Hindi news: Hindi.vaartha.com
Read Also: