हिन्दी | Epaper

Nikitha: నిఖిత హత్య కేసులో కొత్త మలుపు

Anusha
Nikitha: నిఖిత హత్య కేసులో కొత్త మలుపు

అమెరికాలో హత్యకు గురైన భారతీయ యువతి నిఖిత (Nikitha) హత్య కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఆర్థిక లావాదేవీల వల్లే ఆమె హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్నేహితుడి పరిస్థితికి జాలిపడి అప్పు ఇవ్వడమే నిఖిత పాలిట శాపమైంది. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఏకంగా ఆమెను హత్య చేశాడు అర్జున్ శర్మ. అమెరికాలో ఉంటున్న నిఖిత, తమిళనాడుకు చెందిన అర్జున్‌ శర్మ ఇద్దరు స్నేహితులు.

Read also: TG: విశ్రాంత ఉద్యోగుల చలో అసెంబ్లీ ఉద్రిక్తం.. అరెస్టులు

నాలుగున్నర వేల డాలర్లు అప్పుగా ఇచ్చిన నిఖిత

ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అర్జున్ శర్మ.. నిఖిత (Nikitha) వద్ద నుంచి నాలుగున్నర వేల డాలర్లు అప్పుగా తీసుకున్నాడు. త్వరలోనే తీరుస్తానని మాట ఇచ్చాడు. అతడి మాటలు నమ్మిన నిఖిత.. అర్జున్‌ శర్మ అడిగిన మొత్తం ఇచ్చింది. డబ్బులు తీసుకున్న తర్వాత.. నెలలు గడుస్తున్నా అర్జున్‌ శర్మ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయడు.. డబ్బులు అడిగితే తిరిగి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ నిఖిత అర్జున్ శర్మపై ఒత్తిడి తెచ్చింది.

 New twist in Nikitha murder case
New twist in Nikitha murder case

దీంతో అతడు మూడున్నరవేల డాలర్లు ఇచ్చాడు. మిగిలిన 1000 డాలర్లు కూడా ఇవ్వాలని కోరడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన అర్జున్ శర్మ.. నిఖితకు ఇచ్చిన డబ్బులను బలవంతంగా తిరిగి తనకు పంపించుకున్నాడు. ఆ తర్వాత ఆమెను హత్య చేసి.. ఇండియాకు పారిపోయి వచ్చాడు. నిఖిత హత్య గురించి తెలుసుకున్న ఇంటర్‌ పోల్‌ పోలీసులు.. తమిళనాడులో అర్జున్‌ శర్మను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

1,900 మంది ఇరాన్ సైనికులను చంపేశాం!

1,900 మంది ఇరాన్ సైనికులను చంపేశాం!

ఇరాన్‌ యుద్ధంతో పాక్‌లో తీవ్ర సంక్షోభంతో విలవిలా

ఇరాన్‌ యుద్ధంతో పాక్‌లో తీవ్ర సంక్షోభంతో విలవిలా

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

యుద్ధం ముగింపుపై ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో

ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది- ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది- ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష

విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

📢 For Advertisement Booking: 98481 12870