Jubilee Hills bypoll : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఇచ్చారని ఆరోపిస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు హైకోర్టులో కేసు దాఖలైంది. నామినేషన్ అఫిడవిట్‌లో ఆస్తులు, ఇతర వివరాలకు సంబంధించిన సమాచారం సరైనదిగా లేదని మాగంటి సునీత వాదించారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానం త్వరలో విచారణ చేపట్టే అవకాశం ఉంది.
Read also: EC: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు
భారీ మెజార్టీతో గెలుపు
అత్యంత ఉత్కంఠగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills bypoll) కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు 25 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ల నుంచి ప్రతి రౌండ్ వరకు నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ తన మెజార్టీని క్రమంగా పెంచుకున్నారు.
విజయం అనంతరం నవీన్ యాదవ్ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన, ఎంఐఎంతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి, అనేక దశలను దాటి జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు స్థాయి మెజార్టీతో తన కలను నెరవేర్చుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: