Nampally: హైదరాబాద్ నగరవాసులకు చేపల వంటకాలు మరింత చేరువయ్యేలా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే మాసబ్‌ట్యాంక్‌లో ఫిష్ క్యాంటీన్ పనిచేస్తుండగా, తాజాగా నాంపల్లిలో రెండో ఫిష్ క్యాంటీన్‌ను అధికారులు ప్రారంభించారు. దీనివల్ల ప్రజలు తక్కువ ధరకే శుభ్రమైన, రుచికరమైన చేపల వంటకాలను ఆస్వాదించే అవకాశం లభించనుంది.
Read also: solar eclipse: వచ్చే ఆగస్టు రెండున అత్యంత సుదీర్ఘ సూర్య గ్రహణం

Fish canteen to entertain city residents
నాంపల్లి మెట్రో పిల్లర్ 1300 సమీపంలో
నాంపల్లి (Nampally) మెట్రో పిల్లర్ 1300 సమీపంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్‌ను హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సంయుక్తంగా ఆరంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ మాట్లాడుతూ, నగరంలో చేపల వినియోగం పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యంతో ఫిష్ క్యాంటీన్ల సంఖ్యను దశలవారీగా పెంచుతున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా ప్రజలకు నాణ్యమైన చేపలు అందుబాటులోకి రావడమే కాకుండా, మత్స్యకారుల ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు.
Nampally: మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ, వైద్యపరంగా కూడా చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని, దీనిని దృష్టిలో పెట్టుకుని క్యాంటీన్ల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో ఫిష్ క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నిరుద్యోగులు స్వంతంగా ఫిష్ క్యాంటీన్లు ప్రారంభించి ఉపాధి అవకాశాలు పొందేందుకు ప్రభుత్వం సహాయం చేయనుందని వివరించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: