హైదరాబాద్: రాష్ట్రాన్ని మత్తు పదార్థాల బారినుండి పూర్తిగా బయటపడే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ‘డ్రగ్స్‌కు (Drugs) దూరంగా, జీవిత లక్ష్యాలకు దగ్గరగా’ అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి, యువకుడి వద్దకు చేర్చేలా సమగ్రమైన అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Read also : PJTSAU :PG & PhD 2వ విడత కౌన్సిలింగ్ తేదీలు విడుదల

ఈగల్ యూనిట్ ఏర్పాటు, యువతకు భరోసా
మంగళవారం గాంధీ మెడికల్ కళాశాలలోని ఆడిటోరియంలో నిర్వహించిన నశాముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Laxman Kumar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత చదువు, ఉద్యోగ అవకాశాలు, వ్యక్తిత్వ వికాసంలో నిలదొక్కుకునేలా చూడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా ఉందని అన్నారు. మత్తు పదార్థాల పెరుగుతున్న దుష్ప్రభావాల నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్ సరఫరాను పూర్తిగా నిర్మూలించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రవేశపెట్టిన ‘ఈగల్ స్పెషల్ యూనిట్’ కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.
- నిఘా: నగరాల్లో, విద్యా సంస్థల పరిసరాల్లో, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో, డార్క్ నెట్ ద్వారా జరిగే లావాదేవీలపై ఈగల్ టీమ్ నిరంతరం నిఘా పెట్టిందని చెప్పారు.
- ప్రోత్సాహం: మాదకద్రవ్యాల నిర్మూలనలో సేవలందిస్తున్న వాలంటీర్లను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారులు ప్రదర్శించిన నాటక ప్రదర్శన, ఆటలు, పాటలు యువతలో మత్తు వ్యసనంపై అవగాహన కల్పించాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :