ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకరైన లియోనెల్ మెస్సీ (Messi) ఇండియా టూర్ అనేది దేశవ్యాప్తంగానే హాట్ టాపిక్ గా మారింది. మెస్సీని ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కడం ఫుట్‌బాల్ అభిమానులకు ఇదోక గొప్ప కల అనే చెప్పాలి. అందుకే ఆయన టూర్ షెడ్యూల్, కార్యక్రమాలు, టిక్కెట్ల వివరాలు, ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్‌పై అందరి దృష్టిని ఆకర్షించింది. మెస్సీ భారత్‌కు రావడం14 ఏళ్ల తర్వాత రెండోసారి కావడం విశేషం.
Read Also: Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్.. ప్రధాన నిర్వాహకుడు అరెస్ట్

మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు
భారత్ పర్యటనలో ఉన్న ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ (Messi) హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన మెస్సీకి సీఎం రేవంత్ స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి మెస్సీ నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు. అక్కడ 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉప్పల్ స్టేడియానికి వెళ్లనున్నారు.
ఒక్క ఫొటోకు రూ.10 లక్షల వరకు
లియోనెల్ మెస్సితో అభిమానులు ప్రత్యేకంగా ఫొటోలు తీసుకోవాలనుకుంటే పెద్ద మొత్తంలో చెల్లించాల్సిందే. ఒక్క ఫొటోకు రూ.10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని ‘ద గోట్ టూర్’ నిర్వాహక కమిటీ (హైదరాబాద్) సలహాదారు పార్వతిరెడ్డి వెల్లడించారు. కేవలం 100 మందికి మాత్రమే ఫొటోలు తీసుకునే అవకాశం ఉంటుంది.ఇప్పటికే 60 మందికి పైగా రిజస్టర్ కూడా చేసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: