హైదరాబాద్ Raja singh : బిజెపిలో చేరుతున్న వారికి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ పార్టీలో (BJP party) చేరుతున్న వారికి స్వాగతం సుస్వాగతం.. పార్టీలో చేరే ముందు కొన్ని మాటలు యాది మరికొన్ని రాసికూడా పెట్టుకోండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ అసెంబ్లీ, మీ జిల్లా, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగదని చెప్పారు. మీపైన విశ్వాసం పెట్టుకొని మీ కార్యకర్తలు బీజేపీలో చేరిన తర్వాత మీరు వారికి ఏ పదవి కూడా ఇప్పించలేరని పేర్కొన్నారు. బిజేపీలో చేరేముందు కొంత మందితో చర్చలు వేసుకొని రండి అని రాజా సింగ్ సూచనలు చేశారు. ఇటీవల రాజా సింగ్ బీజేపీకి రాజీనామా వేసిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వెయ్యనివ్వలేని కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ముందు మీకే టికెట్ వస్తదని గ్యారెంటీ కూడా ఉండదు. బీజేపీలో ఈ రోజు మీరు చేరుంటారు కదా. మొదట్లో ఫస్ట్ సీట్లో మీరు ఉంటారు కానీ తర్వాత లాస్ట్ సీట్లో ఉంటారు. బీజేపీలో చేరిన తర్వాత కొన్ని అలవాట్లు మీరు చేసుకోవాలి. కొన్ని బాధలు కూడా భరించే శక్తి కూడా మీలో పెంచుకోవాలి” అని ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) అన్నారు. ‘మా అసెంబ్లీలో 11 యేళ్లుగా వారి అణచివేతను ఎదుర్కొంటున్నాము. మా జిల్లా, డివిజన్, నియో జకవర్గంలో వాళ్ల వ్యక్తి ఉంటాడు. మేము కోరుకున్నా మమ్మల్ని మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన మా కార్యకర్తల కోసం ఏమీ చేయలేక పోయాము.

గోషామహల్ అసెంబ్లీ నుంచి బిజెపిలో చేరే ముందు కొంతమందితో మీరు మాట్లాడి.. చేరిన తర్వాత ఏమైతదని కనుక్కోండి. విజయ శాంతి, జితేందర్రెడ్డి, నాగం జనార్దన్రెడ్డి.. చాలామంది వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత ఎందుకు వెళ్లిపోయారో కనుక్కోండి. నా పర్సనల్ విజ్ఞప్తి ఏంటంటే?.. అలాంటి వారితో ఒక్కసారి మాట్లాడండి. హిందూత్వానికి, దేశా నికి, సమా జానికి చాలా మంచిపనులు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. కానీ తెలంగాణలో బీజేపీ కొందరి వల్ల సర్వనాశనం అవుతోంది. బీజేపీలో మేము ఏది చెప్తే అదే అయితది, మేము ఏది రాస్తే అదే రాజ్యమైతది అనుకునే వ్యక్తుల వల్లనే పార్టీ సర్వనాశనం అవుతుంది. ఈరోజు కాకపోతే రేపు తెలంగాణలో రాక్షసులు నాశనమవుతారు. కార్య కర్తల ఆశీస్సులతో బీజేపీ తెలంగాణను పాలిస్తుంది. తెలంగాణలో సీఎం బీజేపీ నుంచే వస్తారు‘ అని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పుకొచ్చారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :