టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) డిసెంబర్ నెలాఖరులోగా కార్పొరేషన్ చైర్మన్లు, మిగిలిన బోర్డు పదవులు పంపిణీ చేసి భర్తీ చేస్తామని ప్రకటించారు. అలాగే, పార్టీ సంస్థాగత నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో జరపడానికి నూతన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మరియు ప్రచార కమిటీలు వస్తాయనీ తెలిపారు. గాంధీభవన్‌లో విలేకరులతో చిట్‌చాట్ చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మంచి మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, (Revanth Reddy) తనకు మధ్య గ్యాప్ అంటూ జరుగుతున్న ప్రచారం అసత్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ నాయకత్వంలో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అవుతాడని ఆయన ఆకాంక్షించారు. హై కమాండ్ నిర్ణయం తీసుకుంటే నిజామాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, టీపీసీసీ పదవితో సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. నూతన డీసీసీలతో పాటు జిల్లాలో ఉన్న మిగతా డీసీసీ పదవుల ఖాళీలను కూడా భర్తీ చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ వివరించారు.
Read Also: HYD: తెలంగాణ రైజింగ్ 2047

గ్లోబల్ సమ్మిట్ విజన్, హరీష్ రావుపై విమర్శలు
గ్లోబల్ సమ్మిట్ (Global Summit) గ్రాండ్ సక్సెస్‌తో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సమ్మిట్ సక్సెస్ చూసి హరీష్ రావుకి గుబులు పుట్టిందని అపహాస్యం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయని ప్రశ్నించారు. ఈ సమ్మిట్ వలన దేశ విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని, ఇదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్‌కు నిదర్శనమని అభివర్ణించారు. గ్లోబల్ సమ్మిట్‌కి రాహుల్ గాంధీ, (Rahul Gandhi) ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. దావోస్ వలన రూ. 1 లక్షా 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని గణాంకాలతో వివరించారు. ఫోర్త్ సిటీ చారిత్రాత్మకం అని, ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో దేశం చూపు తెలంగాణ వైపు మాత్రమే ఉంటుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా సుపరిపాలన కొనసాగుతోందని అన్నారు.
బీఆర్‌ఎస్ పాలనపై ఆరోపణలు, ఈవీఎంలపై వ్యాఖ్యలు
మెట్రో ఫేజ్ తో పాటు మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీలో పార్టీ కోసం స్థలం వంటివి ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఉద్యోగులపై హరీష్ రావు స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసం పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవిష్యత్‌కి గ్లోబల్ సమ్మిట్ సరికొత్త దార్శనికత ఇస్తుందని అన్నారు. లావాదేవీల్లో తేడాల వల్లే కవిత విమర్శలు చేస్తుందని, ఆమె వలన బీఆర్‌ఎస్ నేతల లూటీలు బయటకు వస్తున్నాయని ఆయన చెప్పారు. కవిత లూటీ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కంటే ప్రజా పాలనలో నాలుగింతలు అభివృద్ధి, సంక్షేమం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా, దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (EVM) కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టినప్పటికీ, ట్యాంపరింగ్ మాత్రం బీజేపీ హయాంలో మొదలైందని ఆపాదించారు. తొలి ప్రధాని నెహ్రూ గ్రేటెస్ట్ లీడర్ అని కొనియాడారు, ఆయన విజన్ వల్లే దేశం ఈ స్థితిలో ఉందని చెప్పారు. ఓట్ చోరీ 100 శాతం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: