ఖమ్మం జిల్లాలో హృదయవిదారక ఘటన
Khammam Crime: ఖమ్మం జిల్లా ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. కిటికీలు తయారు చేసే ఒక కంపెనీలో పని చేస్తున్న బానోత్ రుక్మిణీ అన్నం తింటుండగా, సహోద్యోగి రవి ఆమెను “కూర ఉందా?” అని అడిగాడు. రుక్మిణీ తనకు సరిపడేంత కూర మాత్రమే ఉందని చెప్పింది.
అంతే… రవిలో ఆగ్రహం మితిమీరిపోయింది. క్షణాల్లోనే ఆగ్రహం క్రూర రూపం దాల్చింది. గొడ్డలిని పట్టి రుక్మిణీ మెడపై వరుసగా దాడి చేశాడు. రక్తం గంగలా పారింది.. సహోద్యోగులు కంగారు పడి ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం రుక్మిణీ ప్రాణాలతో పోరాడుతోంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి రవిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
ఒక కూర, ఒక క్షణం కోపం — ఒక అమాయక మహిళను చీకటిలోకి నెట్టేసింది.
Read Also: