జూబ్లీహిల్స్(JubileeHills election) ఉప ఎన్నికలలో ఓటింగ్ వేడెక్కింది. ప్రముఖ నటుడు గోపీచంద్ హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న మహిళా సమాజం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాకు తన వేలిపై ఉన్న సిరా గుర్తు చూపించారు.
అదేవిధంగా, నటుడు తనికెళ్ల భరణి కూడా యూసఫ్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. మధ్యాహ్నం 1 గంటల వరకు 31.94 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Read Also: Delhi Blast: పేలుళ్లకు ముందే ‘రెడ్డిట్’లో పోస్ట్ చేసిన స్టూడెంట్
ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా ఈ నియోజకవర్గంలో డ్రోన్ల సాయంతో పర్యవేక్షణ చేపట్టారు. మొత్తం 136 డ్రోన్లు ఉపయోగించి పోలింగ్ ప్రక్రియపై నిఘా ఉంచుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: