ఆర్టీసీలో డ్రైవర్ జాబ్స్ – హైదరాబాద్ యువతకు మంచి అవకాశాలు RTCలో 1,743 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి తాజా నోటిఫికేషన్ (Job Notification) జారీ చేసింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆర్టీసీలో ఇది తొలి పెద్ద ఎత్తున నియామకం కావడం విశేషం. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 1,743 ఉద్యోగాలు ప్రకటించబడ్డాయి. అందులో 1,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. వీటిలో గణనీయమైన భాగం హైదరాబాద్ పరిధిలోనే భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు
- డ్రైవర్లు – 1000
- శ్రామిక్ పోస్టులు – 743
మొత్తం – 1,743
అర్హతలు
- డ్రైవర్ పోస్టులకు: పదో తరగతి ఉత్తీర్ణత, చెల్లుబాటు అయ్యే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. 2025 సెప్టెంబర్ 17 నాటికి కనీసం 18 నెలల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
- శ్రామిక్ పోస్టులకు: ఐటీఐ సర్టిఫికెట్ (డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పెయింటర్, వెల్డర్ మొదలైన విభాగాల్లో).
వయోపరిమితి
- డ్రైవర్ పోస్టులకు: 22 – 35 ఏళ్లు
- శ్రామిక్ పోస్టులకు: 18 – 30 ఏళ్లు
(ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్‌కు 3 సంవత్సరాల సడలింపు).

Job Notification
జీతం
- డ్రైవర్లు: ₹20,960 – ₹60,080
- శ్రామిక్ పోస్టులు: ₹16,550 – ₹45,030
దరఖాస్తు విధానం
- దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి.
- ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 8
- చివరి తేది: 2025 అక్టోబర్ 28
- ఫీజు: డ్రైవర్ పోస్టులకు SC/ST – ₹300, ఇతరులకు ₹600; శ్రామిక్ పోస్టులకు SC/ST – ₹200, ఇతరులకు ₹400.
ఎంపిక విధానం
- ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT)
- మెడికల్ పరీక్షలు
- డ్రైవింగ్ టెస్ట్ (డ్రైవర్ పోస్టులకు)
అదనపు వివరాలు
- నగరంలో రవాణా అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని 1,500 కండక్టర్ పోస్టులు కూడా త్వరలో భర్తీ చేయనున్నట్లు RTC ప్రతిపాదనలు పంపింది. (Job Notification) అందులో దాదాపు 500 ఖాళీలు హైదరాబాద్‌లోనే ఉండే అవకాశముంది.
ఆర్టీసీలో ఎన్ని ఖాళీలు ప్రకటించారు?
మొత్తం 1,743 ఖాళీలు ప్రకటించారు. అందులో 1,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి.
డ్రైవర్ పోస్టులకు కావలసిన అర్హత ఏమిటి?
పదో తరగతి ఉత్తీర్ణత, చెల్లుబాటు అయ్యే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే కనీసం 18 నెలల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: