జేఎన్టీయూ యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థిని దివ్య మృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అధికారుల ఒత్తిడే దివ్య ఆత్మహత్యకు (suiside) కారణమైందని విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు నిరసనలు ప్రారంభించారు.
Read also: Hyderabad: కూకట్‌పల్లి వాసులకు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్

Tension at JNTU University
న్యాయం జరిగే వరకు
ధర్నా సమయంలో విద్యార్థి సంఘాల నేతలు, పోలీసుల మధ్య మాట మాటకు ఉద్రిక్తత పెరిగింది. పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. విద్యార్థులు సంఘటనపై న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తున్నారు. విశ్వవిద్యాలయ పరిపాలన స్పందించకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరమవుతాయని హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: