हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Intermediate: ఇంటర్ విద్యలో పలు సంస్కరణలు

Sushmitha
Telugu News: Intermediate: ఇంటర్ విద్యలో పలు సంస్కరణలు

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ విద్యలో(inter education) భారీ సంస్కరణలకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)ను అమలు చేయడంతో పాటు, ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో యోగా, మెడిటేషన్, క్రీడలను తప్పనిసరి చేయనున్నారు. ఇంటర్ విద్య కమిషనర్, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య విలేకరులతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేయడానికి కొత్తగా 494 జేఎల్ (Junior Lecturer) పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు.

Intermediate

ప్రభుత్వ కాలేజీల్లో హాజరు, నిఘా

ప్రస్తుతం రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలవుతోంది. దీని ద్వారా విద్యార్థులు, లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది హాజరును నమోదు చేస్తున్నారు. విద్యార్థుల హాజరు వివరాలను ప్రతిరోజు వారి తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. దీంతో విద్యార్థులు కాలేజీకి వెళుతున్నారా లేదా అనేది తల్లిదండ్రులకు స్పష్టంగా తెలుస్తుంది. కొత్త సిలబస్ వచ్చే ఏడాది నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే, ‘ల్యాబ్ టు సిస్టమ్'(Lab to System‘) అనే కొత్త విధానాన్ని నందన్ నీలేకని సంస్థతో కలిసి అమలు చేయనున్నారు. జూనియర్ కాలేజీల్లో తరగతి గదులను సీసీ కెమెరాల ద్వారా ఇంటర్ బోర్డు కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగాయని, ఈ ఏడాది 91,853 మంది చేరినట్లు తెలిపారు.

ప్రైవేటు కాలేజీల్లో యోగా, క్రీడలు

ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం వారంలో తప్పనిసరిగా యోగా, మెడిటేషన్, స్పోర్ట్స్ పీరియడ్లు ఉండాలని నిర్ణయించారు. దీనితో పాటు, ప్రైవేటు పాఠశాలలను ఇంటర్ పరీక్షా కేంద్రాలుగా అనుమతిస్తే, వాటిలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని లేకపోతే అనుమతి నిరాకరిస్తామని కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు.

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎఫ్.ఆర్.ఎస్. ఎందుకు అమలు చేస్తున్నారు?

విద్యార్థులు, లెక్చరర్లు, సిబ్బంది హాజరును పర్యవేక్షించడానికి మరియు తల్లిదండ్రులకు సమాచారం అందించడానికి.

కొత్త సిలబస్ ఎప్పటి నుంచి అమలయ్యే అవకాశం ఉంది?

కొత్త సిలబస్ వచ్చే ఏడాది నుంచి అమలయ్యే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870