దక్షిణ మధ్య రైల్వే నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుల షెడ్యూల్‌లలో(Indian Railways) మార్పులు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మార్పులు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ప్రయాణికులు ముందస్తుగా ఈ వివరాలు తెలుసుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది.
Read Also: Tirupati: పరకామణి కేసులో కీలక ట్విస్ట్!

వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో కీలక మార్పులు
దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన కొత్త మార్పులు ఇలా ఉన్నాయి:
1. కాచిగూడ–యశ్వంత్‌పూర్–కాచిగూడ వందే భారత్ (20703/20704)
- ముందుగా ప్రతి బుధవారం రద్దు ఉండేది.
- ఇప్పుడు అది శుక్రవారం రద్దు చేయబడింది.
2. సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్ వందే భారత్ (20707/20708)
- ఇంతకు ముందు ఈ రైలు గురువారం నడవదు.
- తాజా మార్పుల ప్రకారం సోమవారం సర్వీస్ రద్దు.
రైల్వే తెలిపిన ప్రకారం:
- టైమింగ్స్, స్టాప్‌లు, ఫ్రీక్వెన్సీలో ఎలాంటి మార్పులు చేయలేదు.
- మెయింటెనెన్స్ మరియు సమయపాలన మెరుగుపర్చడానికి ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.
- రైల్వే బోర్డు ఆమోదంతోనే తాజా షెడ్యూల్ అమలులోకి వచ్చింది.
టికెట్లు ముందే బుక్ చేసుకున్న ప్రయాణికులు
- రీఫండ్ పొందవచ్చు లేదా
- ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవచ్చు.
దక్షిణ మధ్య రైల్వే కొత్త రైలుసేవను(Indian Railways) ప్రకటించింది.
తిరుపతి – సాయినగర్ షిర్డీ – తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17425/17426)
- డిసెంబర్ 14 నుంచి కొత్తగా ఈ రైలు ప్రారంభం.
- ప్రతి ఆదివారం తిరుపతి నుంచి బయల్దేరు.
- ఉదయం 4:00 గంటలకు బయల్దేరి, సాయంత్రం 4:50 గంటలకు లింగంపల్లికి చేరుతుంది.
- అక్కడి నుంచి సోమవారం ఉదయం 10:45 గంటలకు షిర్డీ చేరుతుంది.
- ఈ రైల్లో 2 AC కోచ్‌లు మరియు జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: