దసరా (Dussehra) పండుగ వేడుకలు ఉత్సాహంగా ముగిసిన తర్వాత, దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమం హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఘనంగా కొనసాగుతుంది. ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమం వల్ల భారీగా ప్రజలు పాల్గొనడం, వందల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి రావడం సహజం. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందుగానే పలు మార్పులు చేపట్టారు.
Nizambad:భోజనం పెట్టలేదని మద్యం మత్తులో కరెంట్ స్తంభం ఎక్కిన భర్త
హైదరాబాద్ నగరంలో నేటి మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) అమలులోకి వచ్చాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ మళ్లింపుల ప్రదేశాలను ప్రకటించారు. నగరంలోని ప్రధాన మార్గాల్లో ప్రయాణించే వారు ఈ మార్పులను గమనించి, ప్రత్యామ్నాయ దారులను ఎంచుకోవాలని సూచించారు.
దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం చేసే ముఖ్య ప్రదేశాలైన పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జలవిహార్ బేబీ పాండ్, సంజీవయ్య పార్క్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ మళ్లింపులు జరుగుతున్నాయి. నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు రేపు (అక్టోబర్ 2వ తేదీ) ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయి.

ఎన్టీఆర్ మార్గ్ వంటి రహదారుల వైపు కేవలం
ప్రధాన కూడళ్లు .. వాటికి అనుసంధానంగా ఉన్న ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు (Traffic) నియంత్రించారు. ముఖ్యంగా.. వీవీ విగ్రహం, సైఫాబాద్, రవీంద్ర భారతి, లిబర్టీ, బషీర్‌బాగ్, ఓల్డ్ అంబేద్కర్ విగ్రహం, అప్పర్ ట్యాంక్ బండ్, నల్లగుట్ట ‘ఎక్స్’ రోడ్లు వంటి కీలక జంక్షన్లలో వాహనాలను వేరే దారుల వైపు మళ్లిస్తున్నారు.
నిమజ్జనం జరుగుతున్న మార్గాల వైపు సాధారణ వాహనాలను అనుమతించడం లేదు. ఇక్బాల్ మినార్, పీవీఎన్ఆర్ మార్గ్ , ఎన్టీఆర్ మార్గ్ వంటి రహదారుల వైపు కేవలం నిమజ్జన వాహనాలకు మాత్రమే పోలీసులు ప్రయాణించేందుకు అనుమతిస్తున్నారు.
వాహనదారులు నిమజ్జనానికి వెళ్లే ముఖ్య మార్గాలను పూర్తిగా తప్పించుకోవాలని (Avoid) ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. నగరంలో అత్యవసర పనులు ఉన్నవారు ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించుకోవడం ద్వారా సమయం ఆదా చేసుకోవచ్చని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: