హైదరాబాద్, అక్టోబర్ 5: నగరంలో ఆదివారం తెల్లవారు జామునుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, ఫిల్మ్‌నగర్, ఖైరతాబాద్, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, సుల్తాన్‌బజార్, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లోయర్‌ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ ప్రాంతాల్లో భారీగా(Heavy) కురిసింది.
Read Also: Rashikhanna : బాలీవుడ్ ఇండస్ట్రీ పై రాశిఖన్నా కీలక వ్యాఖ్యలు

పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో నగరమంతా వర్షం దంచికొడుతోంది. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పలు అపార్ట్మెంట్లలో(Apartments) కూడా వర్షపు నీరు చొరబడింది. శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారి చెరువులా మారింది.
పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మూసాపేట్, బేగంపేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వర్షం తీవ్రంగా కురుస్తుండడంతో ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లిస్తున్నారు. మరోవైపు, వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం, రాబోయే రెండు గంటల్లో పటాన్‌చెరు, ఆర్సీపురం, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్‌పల్లి, నిజాంపేట, జీడిమెట్ల, సుచిత్ర, అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, బొల్లారంలలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
ఇక తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఈ రోజు మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకూ వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
హైదరాబాద్‌లో వర్షం ఎప్పుడు మొదలైంది?
ఆదివారం తెల్లవారు జామున 7 గంటల ప్రాంతంలో వర్షం మొదలైంది.
ఎక్కువగా వర్షం పడిన ప్రాంతాలు ఏవి?
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, నాంపల్లి, లోయర్‌ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ మొదలైన ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: