హైదరాబాద్ యూసుఫ్‌గూడ పరిధిలోని మధురానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో శనివారం రాత్రి ఘోర సంఘటన చోటుచేసుకుంది. పవన్ కుమార్ (35) అనే వ్యక్తి తన నివాసంలో మృతదేహంగా కనిపించడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అతని పెంపుడు కుక్క, సైబీరియన్ హస్కీ నోటికి రక్తం కనిపించడంతో కుక్కే యజమానిని కరిచి చంపిందనే అనుమానాలు కలిగాయి. ఆదివారం రాత్రి నుంచి ఫోన్ తీయకపోవడంతో పవన్ స్నేహితుడు ఇంటికి వచ్చి చూడగా, అతడు హాల్‌లో రక్తపు మడుగులో మృతదేహంగా పడివుండటం గమనించాడు. వెంటనే మధురానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
యజమానినికరచి చంపినపెంపుడు కుక్క
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కుక్కే చంపిందా, లేక ఎవరో హత్య చేసి కుక్కపై నింద వేయాలనుకున్నారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. కుక్క యజమానిని కరిచిందా లేక హత్య అనంతరం శరీరాన్ని గాయపరిచిందా అన్నది ఇప్పుడప్పుడే తేలదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి పూర్తి నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
Read More : NIA: ఉగ్రదాడిలో ముష్తాక్ అహ్మద్ జర్గర్ పాత్రపై దర్యాప్తు