హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు నిర్వహించబడుతున్నాయి. ఈ మేరకు ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని కిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక పోలింగ్ కేంద్రం కార్పొరేటర్ల కోసం, మరొకటి ఎక్స్ ఆఫీషియో సభ్యుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొత్తం 112 మంది ఓటర్లున్న ఈ ఎన్నికలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగనున్నాయి.ఎంపికలో 200-250 మంది పోలీసు సిబ్బంది, 500 మంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిబంధనలతో జరిగేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ అమలు చేయబడింది. 23న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే మిగతా ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటించారు.ఈ ఎన్నికలలో ఎంఐఎం, బీజేపీ పార్టీలు పోటీలో ఉన్నాయి. ఎంఐఎం అభ్యర్థిగా మీరా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రాష్ట్ర బరిలో ఉన్నారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో 112 ఓటర్లలో 31 మంది కార్పొరేటర్లు, 81 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఈ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి బరిలో నిలిచింది. 20 సంవత్సరాలుగా ఏకగ్రీవంగా నిర్వహించే హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలో ఈసారి పోలింగ్ జరుగుతుంది.
Read more : Pahalgam: పహల్గాం ఉగ్రదాడి స్పందించిన క్రికెటర్లు