Hyderabad iconic cable : హైదరాబాద్ నగరంలో మరో ఐకానిక్ బ్రిడ్జి రూపుదిద్దుకోబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరమైన నిధుల మంజూరు పూర్తయింది. టెండర్ల ప్రక్రియ కూడా ముగియడంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అంచనాల ప్రకారం వచ్చే ఏడాది చివరి నాటికి ఈ కేబుల్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రానుంది.
నగరంలో రోడ్డు కనెక్టివిటీ మరింత మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం లక్ష్యంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. చారిత్రాత్మక మీరాలం ట్యాంక్‌పై నిర్మించనున్న ఈ బ్రిడ్జ్ హైదరాబాద్‌కు మరో గుర్తింపుగా నిలవనుంది. ఈ ప్రతిపాదనలకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఆమోదం తెలిపింది. మొత్తం రూ.430 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు.
Read also: Elections: నామినేషన్ రెండో విడత ప్రారంభం
ఈ బ్రిడ్జి నిర్మాణంతో శాస్త్రీపురం నుంచి చింతల్‌మెట్ మీదుగా (Hyderabad iconic cable) బెంగళూరు జాతీయ రహదారి (NH-44) వరకు నేరుగా కనెక్టివిటీ లభించనుంది. దీంతో చింతల్‌మెట్-ఎన్‌హెచ్44 మార్గంలో ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొత్తం వ్యయాన్ని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) భరిస్తుంది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (EPC) విధానంలో పనులు చేపట్టాలని MRDCLకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూసేకరణతో పాటు టెండర్లు, నిర్మాణ పనులు సమాంతరంగా కొనసాగించాలని స్పష్టం చేసింది.
ప్రాజెక్ట్ నాణ్యత, పర్యవేక్షణ కోసం ఓపెన్ టెండర్ ద్వారా ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ (PMC) నియామకం చేపడతారు. ఈపీసీ కాంట్రాక్టర్ సమర్పించే డిజైన్‌లను ముందుగా పీఎంసీ, ఆ తర్వాత ఐఐటీ హైదరాబాద్, ఎన్ఐటీ వరంగల్ లేదా జేఎన్‌టీయూ హైదరాబాద్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమై వేగంగా సాగుతున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: