హైదరాబాద్‌లో హై అలర్ట్ : ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడుని దృష్టిలో ఉంచుకుని భద్రత కట్టుదిట్టం
Hyderabad High Alert : ఢిల్లీ లోని రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన పేలుడులో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డ ఘటన అనంతరం హైదరాబాద్‌లో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేయబడ్డాయి. నగర పోలీసులు సోమవారం సాయంత్రం నుంచి హై అలర్ట్ (Hyderabad High Alert) ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద చట్రవుటలు గమనించిన వెంటనే Dial 100 కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమైన రహదారులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ ప్రాంతాలు వంటి రద్దీ ప్రదేశాల్లో పోలీసులు కఠిన తనిఖీలు చేపట్టారు. వాహనాల పరిశీలనలు, రూటు మార్చు చెక్‌పోస్టులు, పబ్లిక్ ఏరియాల్లో పహారా పెంచారు. అత్యవసర పరిస్థితులలో వెంటనే స్పందించేందుకు పట్రోలింగ్ వాహనాలు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే నగరవ్యాప్తంగా CCTV పర్యవేక్షణను మరింత బలపరిచారు.
Read Also: Jubilee Hills Bypoll Polling : నేడే ‘జూబ్లీహిల్స్’ పోలింగ్..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక తనిఖీలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో RPF, GRP, బాంబు నిర్వీణ దళం (BDDS) మరియు డాగ్ స్క్వాడ్ సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ప్రయాణికుల భద్రత కోసం ఇది ముందస్తు జాగ్రత్త చర్యగా చేపట్టినట్టు అధికారులు తెలిపారు. విభిన్న విభాగాల సంయుక్త చర్యలు భద్రతా నిర్వహణలో పరస్పర సమన్వయానికి ఎంత ప్రాధాన్యం ఉందో మరోసారి స్పష్టమైందని వారు పేర్కొన్నారు.
ఇటీవల గుజరాత్ ATS ఒక వ్యక్తి డాక్టర్ అహ్మద్ మొయిద్దీన్ సయ్యద్ ను ఉగ్ర కుట్రలో ప్రమేయం ఉన్నట్లు అనుమానంతో అరెస్ట్ చేసిన విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలు అప్రమత్తంగా ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also :