హైదరాబాద్ నగరంలోని ప్రశాంతినగర్‌లో నిన్న ఒక పెద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది ఓ కాపర్ రీసైక్లింగ్ యూనిట్‌లో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో చుట్టుపక్కల జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.1 కోటి విలువైన కాపర్ తుక్కు పూర్తిగా కాలిపోవడం గమనార్హం.మంటలు ఒక్కసారిగా ఎగసిపడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యారు. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే స్పందించారు. మూడు ఫైరింజన్లు, పది వాటర్ ట్యాంకర్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.స్థానికులు మాట్లాడుతూ.సిబ్బంది సకాలంలో రాగా, భారీ ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. లేకపోతే మంటలు ఇంకెంత వరకు వ్యాపించేవో ఎవరికీ తెలియదు.అగ్నిమాపక సిబ్బంది అలర్ట్‌గా ఉండటం వల్లే మిగిలిన పరిశ్రమలకు పెద్ద ప్రమాదం జరగలేదు.

అయితే ఈ ప్రమాదం పక్కనే ఉన్న డాకస్ సీ కంపెనీపై కూడా ప్రభావం చూపించింది. అగ్ని ప్రమాదం కారణంగా ఆ కంపెనీలోని ముడిసరుకు, పరికరాలు దెబ్బతిన్నాయని యాజమాన్యం తెలిపింది. అంచనా ప్రకారం దాదాపు మరో కోటి రూపాయల నష్టం వాటిల్లిందని వారు పేర్కొన్నారు.ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా పరిశీలించి, నివేదిక ఇవ్వమని అగ్నిమాపక శాఖ ఆదేశించింది.ప్రశాంతినగర్‌లో ఇటీవలే ఇలాంటివే ఇతర చిన్న ప్రమాదాలు కూడా జరిగినట్లు స్థానికులు తెలిపారు. పారిశ్రామిక యూనిట్లలో తగిన భద్రతా చర్యలు తీసుకోవడంలో కొరత కనిపిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. అధికారులు ఈ ఘటనను గమనించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటన నేపథ్యంలో పరిశ్రమ యాజమాన్యాలపై నిఘా మరింత కఠినంగా ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తప్పనిసరి అనే సందేశం ఈ ప్రమాదం ద్వారా స్పష్టమవుతోంది.