हिन्दी | Epaper

Hyderabad Crime: వనస్థలిపురం గర్భిణి హత్యకు గల కారణాలు ఇవే..

Saritha
Hyderabad Crime: వనస్థలిపురం గర్భిణి హత్యకు గల కారణాలు ఇవే..

Hyderabad Crime: హైదరాబాద్ వనస్థలిపురం లో ఓ నాలుగు నెలల గర్భిణి (Pregnant) దారుణ హత్యకు గురైన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తనకు విడాకులు ఇచ్చి మరోపెళ్లి చేసుకున్న మహిళను ఆమె మాజీ భర్త అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దేవరకొండ మహేష్‌కు, సునీతకు పెద్దల సమ్మతితో 2022లో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కెనడా వెళ్లారు. అయితే పెళ్లి జరిగిన 8 నెలలకే మనస్పర్థలు వచ్చాయి. దీంతో భర్తను కాదని ఇండియాకు వచ్చిన సునీత.. మహారాష్ట్రలోని బ్రహ్మపురి పోలీస్‌ స్టేషన్‌లో భర్త వేధిస్తున్నాడని కేసు పెట్టింది. దీంతో మహేష్‌పై పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత 2024లో ఇద్దరూ చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారు. అనంతరం సునీత హైదరాబాద్ చేరుకొని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరింది. అక్కడే నగరానికి చెందిన శ్రీనాథ్‌ అనే యువకుడితో ప్రేమలో పడింది. సునీత తన మెుదటి వివాహాన్ని దాచి 2025 అతడిని రెండో పెళ్లి చేసుకుంది. వీరు వనస్థలిపురం గ్రీన్‌సిటీ కాలనీలో అత్తతో కలిసి నివాసం ఉంటుండగా ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి.

Read Also: Sunitha: విడాకులు ఇచ్చిందనే కోపంతో హత్య చేసిన భర్త

Hyderabad Crime: వనస్థలిపురం గర్భిణి హత్యకు గల కారణాలు ఇవే..
Hyderabad Crime: These are the reasons behind the murder of a pregnant woman in Vanasthalipuram..

ఆమె సంతోషం చూడలేకనే హత్య

ఇటీవల మహేష్ తల్లి చనిపోగా ఆ కార్యక్రమాల తర్వాత తాను కెనడా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే సునీత పెట్టిన పాత కేసుల కారణంగా అతడికి వీసా రాలేదు. దీనికి తోడు ఆమె మరో పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తుండటాన్ని మహేష్ జీర్ణించుకోలేకపోయాడు. ఆమెపై విపరీతమైన కక్ష పెంచుకున్నాడు. సునీతను చంపేయాలని డిసైడ్ అయ్యాడు.

సునీత అడ్రెస్ కనుక్కొని భర్త బయటకు వెళ్లడం గమనించి అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్నాడు. లిఫ్ట్ కాకుండా మెట్ల ద్వారా ఆమె ఇంటికి చేరుకొని తలుపుకొట్టాడు. సునీత అత్త ఇంటి వెనకాల బట్టలు ఆరేస్తుండగా సునీత డోర్ తీసింది. ఎదురుగా తన మాజీ భర్త మహేష్‌ చేతిలోనే బ్యాగును చూసి షాక్‌కు గురైంది. ఆమె తేరుకునే లోపే ఓ గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి గొడవపడ్డాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి హతమార్చాడు.

సునీత కేకలు విని అత్త అక్కడకు చేరుకోగా అప్పటికే ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. భయంతో వణికిపోయిన అత్త పక్కింటి వాళ్లకు సమాచారం అందించింది. గదిలోనే ఉండిపోయిన మహేష్ లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. పోలీసులు అక్కడకు చేరుకోగా అప్పటికే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద‌పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

స్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్ట్

స్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్ట్

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

బరితెగించిన కామాంధులు.. లిఫ్ట్ అడిగిన మహిళపై అత్యాచారం!

బరితెగించిన కామాంధులు.. లిఫ్ట్ అడిగిన మహిళపై అత్యాచారం!

సునీతా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

సునీతా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

23 రోజుల పోరాటం.. మూడేళ్ల చిన్నారి కన్నుమూత

23 రోజుల పోరాటం.. మూడేళ్ల చిన్నారి కన్నుమూత

ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
1:01

ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం

ఖమ్మం జిల్లాలో ఘోరం.. ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

ఖమ్మం జిల్లాలో ఘోరం.. ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

📢 For Advertisement Booking: 98481 12870