హైదరాబాద్ (Hyderabad) నగరంలోని చాంద్రాయణగుట్టలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పక్కింటి పిల్లలతో తరచూ గొడవ పడుతున్నాడనే కోపంతో, పదేళ్ల బాలుడిని అతని సవతి తండ్రి కిరాతకంగా హత్య (Crime) చేశాడు. బాలుడి తలను రోడ్డుకేసి బాదడంతో తీవ్రంగా గాయపడిన బాలుడు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
Read Also: Akhilesh Yadav: హైదరాబాద్‌లో పర్యటిస్తున్న అఖిలేశ్

గొడవల కారణంగా తీవ్ర ఆగ్రహం
పోలీసుల కథనం ప్రకారం, చాంద్రాయణగుట్టకు చెందిన ఒక మహిళకు గతంలో వివాహమై విడాకులు తీసుకున్న తరువాత, అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఆమె మొదటి భర్త కుమారుడు షేక్ మహ్మద్ అజహర్ (10) కూడా వారితోనే ఉంటున్నాడు. అయితే, అజహర్ తరచూ ఇరుగుపొరుగు పిల్లలతో గొడవపడేవాడు. ఈ విషయమై స్థానికులు బాలుడి సవతి తండ్రిని నిలదీసేవారు, ఇది నిందితుడికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
రోడ్డుకేసి తల బాది హత్య: నిందితుడి అరెస్ట్
ఈ క్రమంలోనే ఈ నెల 7న తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు, బాలుడి తలను పట్టుకుని రోడ్డుకేసి బలంగా కొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన అజహర్‌ను కుటుంబసభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడైన సవతి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: