HYD రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం, పరీక్షా కేంద్రాల సంఖ్యను గత ఏడాది కంటే పెంచనున్నారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రారంభించినట్టు తెలుస్తోంది.
Read Also: TG High Court: హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

గత ఏడాది ఇంటర్ పరీక్షలకి (Inter exams) 9,96,971 మంది విద్యార్థులు హాజరు కాగా.. వారి కోసం 1532 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే 9,79,747 మంది విద్యార్థులు ఫీజును చెల్లించారని, మరో 61 వేల మంది ఫీజు చెల్లించాల్సి ఉన్నట్టు అధికారిక అడ్మిషన్లను బట్టి తెలుస్తోంది. ఈ ఏడాది 10 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఈ ఏడాది పరీక్షా కేంద్రాల సంఖ్యను గత ఏడాది కంటే ఎక్కువ ఏర్పాటు చేయాల్సి వస్తుందని ఇంటర్ బోర్డు (Inter Board) ఉన్నతాధికారులు చెబుతున్నారు.
పరీక్ష ఫీజు గడువు మరియు పరీక్షల షెడ్యూల్
నవంబర్ 1 నుంచి ప్రారంభమైన పరీక్ష ఫీజు చెల్లింపు గడువు, ఎటువంటి అపరాధ రుసుం లేకుండా నవంబర్ 14 తో ముగిసింది.
- అపరాధ రుసుం రూ. 100తో నవంబర్ 16 నుంచి 24 వరకు స్వీకరించారు.
- అపరాధ రుసుం రూ. 500తో నవంబర్ 26 నుంచి డిసెంబరు 1 వరకు స్వీకరించారు.
- అపరాధ రుసుం రూ. 1000తో నేటి (డిసెంబరు 3) నుంచి ఈ నెల 8 వరకు అవకాశం కల్పించారు.
- అపరాధ రుసుం రూ. 2000తో ఈ నెల 10 నుంచి 15 వరకు అవకాశం కల్పించారు.
ఫీజు వివరాలు మరియు పరీక్ష తేదీలు
పరీక్ష ఫీజును ఈ విధంగా నిర్ణయించారు:
- మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులకు: రూ. 530 (ఇంగ్లీష్ ప్రాక్టికల్స్‌కి రూ. 100 అదనం).
- మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు: రూ. 870.
- సెకండియర్ జనరల్ ఆర్ట్స్ విద్యార్థులకు: రూ. 530 (ఇంగ్లీష్ ప్రాక్టికల్స్‌కి రూ. 100 అదనం).
- సెకండియర్ జనరల్ సైన్స్ విద్యార్థులకు, సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులకు: రూ. 870.
ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు జరగనున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: