పెళ్లైన జంట ఇద్దరు ముగ్గురుగా ముగ్గురు నలుగురుగా జీవించాలని తపిస్తారు. అంటే పెళ్లైన తర్వాత సంతానం కోసం ఎవరైనా ఎదురుచూస్తారు. కొందరికి వెంటనే పిల్లలు పుడతారు. మరికొందరికి కొన్ని సంవత్సరాల తర్వాత పుడతారు. అయితే కొందరికి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు గర్భం దాల్చలేరు. ఇలాంటి దంపతులు నేడు అత్యాధునిక వైద్యశాస్త్రం ద్వారా సంతానాన్ని పొందుతున్నారు.
Read Also: Encounter:17ఏళ్ల వయసులోనే దళంలోకి.. ఎవరు ఈ భయంకర వ్యూహకర్త?
ఈ జంట కూడా తమకు అందుబాటులో ఉన్న వైద్యం ద్వారా సంతానాన్ని పొందాలనుకున్నారు. వివాహమై ఏళ్లు గడుస్తున్నా తల్లిదండ్రులు కాలేకపోతున్నామనే బాధ, బంధువులు, ఇరుగు పొరుగువారి మాటలను దాటుకొని ఐవీఎఫ్ ద్వారా సంతానం కోసం యత్నించారు. అనుకున్నట్లుగా చికిత్స ద్వారా తమ జీవితంలో కొత్త వెలుగును చూడాలనుకున్నారు ఆ దంపతులు. కానీ విధి మరోలా రచించి, తీరని వేదనే మిగిల్చింది.

గర్భంలోని పిల్లలు, భార్యా మృతి
శంషాబాద్ లో (Shamshabad) నివాసం ఉంటున్న విజయ్, శ్రావ్య దంపతులు. వీరి స్వస్థలం కర్ణాటక. బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు (HYD) వచ్చారు. విజయ్ ఎయిర్ పోర్ట్ లో (Airport) ఉద్యోగం చేస్తున్నారు. వీరి వివాహం జరిగి ఏళ్లు గడిచినా పిల్లలు కలగకపోవడంతో ఐవీఎఫ్ చికిత్స ద్వారా పిల్లలను కనేందుకు నిర్ణయించుకున్నారు. చివరకు శ్రావ్య గర్భం దాల్చింది. అదీ కవల పిల్లలు కావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు.
శ్రావ్య ఎనిమిది నెలల గర్భిణీగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కడుపు నొప్పి రావడంతో ఆమె తన తల్లితో అత్తాపూర్ సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు చేసిన పరీక్షల్లో శ్రావ్య కడుపులో ఉన్న కవల పిల్లలు ఇద్దరూ చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అంతలోనే శ్రావ్య ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గుడిమల్కాపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను తరలించారు. ఆసుపత్రికి వెళ్లిన కొద్దిసేపటికే శ్రావ్య కూడా చికిత్స పొందుతూ మరణించింది.
బాధను తట్టుకోలేక భర్త ఆత్మహత్య
ఎంతో ఆశతో ఎదురుచూసిన కవలల పిల్లలు, ఆ తర్వాత ప్రాణంగా ప్రేమించిన భార్య మరణించడంతో భర్త విజయ్ కుమార్ (Vijay Kumar) తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. భార్య మరణంతో కుంగిపోయి ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. మరుసటి రోజు శ్రావ్య మృతదేహాన్ని అప్పగించేందుకు సంతకం కోసం ఆసుపత్రి సిబ్బంది విజయ్ కి పదేపదే ఫోన్ చేశారు. ఎసెన్నిసార్లు చేసినా విజయ్ స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే అతని ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య, పిల్లలు మరణంతో విజయ్ మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: