తెలంగాణ HYD ‘తెలంగాణ రైజింగ్ 2047’ లో (Telangana Rising) భాగంగా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించేందుకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే, రాష్ట్రంలో అధికంగా ఉన్న యువతే కీలకమని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి నైపుణ్యంతో కూడిన యువత చోదక శక్తిగా మారుతుందని, వారిని బలోపేతం చేయడానికి విద్య, క్రీడలు, ఆవిష్కరణలు, నైపుణ్యాలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై విజన్ 2047 డాక్యుమెంట్లో ఒక సమగ్ర కార్యాచరణను పొందుపరిచింది. పరిశ్రమల్లో అవసరమయ్యే విధంగా నైపుణ్యాలతో కూడిన మానవ వనరులుగా యువతను తీర్చిదిద్దాలని, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది.
Read Also: Adluri Laxman: గ్లోబల్ సమ్మిట్ తో పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట
గ్లోబల్ డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి
ప్రస్తుతం యువతలో డిజిటల్ స్కిల్స్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అండ్ మెషీన్ లెర్నింగ్, ఆరోగ్య రంగ కార్యకర్తలు, అలాగే ఎలక్ట్రిషియన్స్, హార్డ్‌వేర్ మెకానిక్స్ వంటి సాంకేతిక ఉద్యోగాలకు జపాన్, యూకే, జర్మనీలతో పాటు ఆసియా పసిఫిక్ తదితర దేశాల్లో ఎక్కువ ఆదరణ ఉంది. ఈ గ్లోబల్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ ప్రభుత్వం వివిధ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు టామ్‌కామ్‌ను బలోపేతం చేయనుంది. దీని కోసం విదేశాలకు వెళ్లదలచుకునే వారికి ఆయా దేశాల భాషల శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

జర్మన్ ‘ద్వంద్వ అప్రెంటిస్‌షిప్ మోడల్’ అమలు
మన దేశంలో విద్యా వ్యవస్థలో ప్రాక్టికల్స్ కంటే థియరీ విధానమే ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు తరగతి గది పాఠాలకే పరిమితమవుతున్నారు. దీన్ని మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉదాహరణకు, జర్మనీ విద్యా వ్యవస్థలో ద్వంద్వ విధానం (డ్యూయల్ అప్రెంటిస్‌షిప్ మోడల్) అమలవుతోంది. ఈ విధానంలో విద్యార్థులు వారంలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే కళాశాలల్లో పాఠాలు చదువుకుంటారు. మిగిలిన నాలుగు లేదా ఐదు రోజులు పరిశ్రమల్లో శిక్షణ పొందుతారు. అక్కడ పనిచేసినందుకు గానూ వారికి కొంత మొత్తంలో స్టైఫండ్‌ను చెల్లిస్తారు. అలాంటి అప్రెంటిస్‌షిప్ వ్యవస్థనే తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: