హైదరాబాద్: (HYD)బడా ఆర్థిక నేరగాడు ఉప్పలపాటి సతీష్‌ను అదుపులోకి తీసుకుని, రూ.2 కోట్ల డీల్ కుదుర్చుకున్న తర్వాత వదిలేసిన ఆరోపణలపై సస్పెండ్ అయిన టాస్క్‌ఫోర్స్ ఎస్సై శ్రీకాంత్ గౌడ్(Srikanth Goud) ఉదంతంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముంబై కేంద్రంగా షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా వేలాది మంది నుంచి ₹350 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసి పరారైన కేసులో సతీష్ ప్రధాన నిందితుడు.
Read Also: Tirumala: పరకామణి కేసులో రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు!

తప్పించుకున్న నేరగాడు, పోలీసులపై అనుమానం
నిందితుడు ముంబైలోని అంధేరిలో రహస్యంగా ఉంటున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తన బృందంతో అక్కడికి వెళ్లి, సతీష్‌ను పట్టుకున్నారు. అయితే, హైదరాబాద్‌కు వస్తుండగా సంగారెడ్డి సమీపంలో ఒక దాబా వద్ద అతను తమ కళ్లుగప్పి పారిపోయినట్లు ఎస్సై ఉన్నతాధికారులకు తెలిపారు. దీనిపై అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు ఆరా తీయగా, సదరు ఎస్సై రెండు కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకుని నేరగాడు సతీష్‌ను వదిలేసినట్లు తేలింది. దీనిపై కొత్వాల్ సజ్జనార్‌కు(Sajjanar) నివేదిక అందజేయడంతో ఎస్సై శ్రీకాంత్ గౌడ్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.
పై అధికారుల పాత్రపై దర్యాప్తు
ఈ విచారణలో ఎస్సై శ్రీకాంత్ గౌడ్‌తో(SI Srikanth Goud) పాటు మరికొందరు టాస్క్‌ఫోర్స్ అధికారుల ప్రమేయం ఉందని వార్తలు వస్తున్నాయి. ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తీసుకున్న డబ్బులో కొంత భాగం పై అధికారులకు కూడా అందజేసినట్లుగా ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైందని తెలిసింది. దీనిపై మరింత లోతుగా విచారణ జరుగుతోంది. ఎస్సై శ్రీకాంత్ గౌడ్‌కు సహకరించిన పై అధికారుల గురించి ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. వీరిపైనా వేటు పడే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు, తప్పించుకున్న ఆర్థిక నేరగాడు సతీష్ కోసం ముంబై పోలీసుల సహకారంతో గాలింపు కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: