ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) తన భారత పర్యటనలో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్‌కు రానున్నాడు. ‘ది గోట్ ఇండియా టూర్ 2025’ లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న 7 వర్సెస్ 7 సెలబ్రిటీ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (Revanth Reddy) కలిసి మెస్సీ గోట్ కప్‌నకు అటెండ్ అవ్వనున్నారు. ఈ అర్జెంటీనా లెజెండ్ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఫుట్‌బాల్ అభిమానులతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఎందరో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Yashasvi Jaiswal: రోహిత్ గొప్ప హృదయానికి అది నిదర్శనం: జైస్వాల్

హైదరాబాద్‌లో మెస్సీ కార్యకలాపాలు మరియు భద్రత
13న తెల్లవారుజామున కోల్‌కతాకు చేరుకోవడంతో మెస్సీ భారత పర్యటన అధికారికంగా ప్రారంభమవుతుంది. అదే రోజు అక్కడ తన 70 అడుగుల విగ్రహాన్ని (ఇప్పటివరకు అతి ఎత్తైన విగ్రహం) వర్చువల్‌గా ఆవిష్కరించనున్నారు. అదే రోజు సాయంత్రం, ప్రత్యేక విమానం ద్వారా మెస్సీ సుమారు 200 మందితో కూడిన టీమ్‌తో కలిసి హైదరాబాద్‌కు రానున్నాడు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అనంతరం, ఈ స్టార్ ఆటగాడు యువ టాలెంటెడ్ ప్లేయర్‌లకు మాస్టర్ క్లాస్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్స్‌లో పాల్గొని సందడి చేయనున్నారు. చివర్లో మ్యూజికల్ కాన్సెర్ట్ జరగనుంది. ఆ రోజు రాత్రి మెస్సీ నగరంలోనే బస చేయనున్నాడు. ఈ లెజెండరీ ప్లేయర్ నగర పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మెస్సీ, అతడి బృందం హైదరాబాద్‌కు చేరుకున్నప్పటి నుంచి స్వదేశానికి వెళ్లేంత వరకు భారీ భద్రత కల్పించనున్నారు.
ముంబై, ఢిల్లీ పర్యటనలు: మోదీతో భేటీ
హైదరాబాద్ పర్యటన ముగిశాక, మరుసటి రోజు మెస్సీ ముంబైకి వెళ్లనున్నాడు. అక్కడ సెలబ్రిటీలతో కలిసి ఓ ఫ్యాషన్ షోలో పాల్గొననున్నారు. ఆ తర్వాత ఓ సామాజిక సేవ కోసం నిర్వహించే ఈవెంట్‌లో ర్యాంప్ వాక్ చేసి అలరించనున్నాడు. చివరగా ఢిల్లీ చేరుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (Narendra Modi) భేటీ కానున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమాలు ముగిశాక అదే రోజు రాత్రి స్వదేశానికి బయలుదేరనున్నాడు. మెస్సీ భారత్‌కు రావడం ఇదే తొలిసారి కాదు, గతంలో 2011లో వెనిజువెలాతో జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం కోల్‌కతాలో పర్యటించాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: