హైదరాబాద్‌లో మటన్ ప్రియులకు ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. నగరంలోని సాధారణ మార్కెట్లలో కిలో మటన్ ధర రూ.800 నుంచి రూ.900 వరకు ఉండగా, అంబర్‌పేట్ గోల్నాక కబేలా వద్ద కేవలం రూ.550లకే విక్రయిస్తున్నారు. ఈ తక్కువ ధర కారణంగా తెల్లవారుజాము నుంచే ప్రజలు క్యూ కడుతున్నారు. బల్క్ విక్రయాల కారణంగా నాణ్యమైన మటన్‌ను (Mutton) తక్కువ ధరకు అందిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడ మటన్‌తో పాటు మేక తలకాయ రూ.400, బోటీ సెట్ రూ.300లకే లభిస్తుండటంతో చాలామంది రెండు నుంచి మూడు కిలోల వరకు కొనుగోలు చేస్తున్నారు. చెంగిచర్ల వంటి ఇతర ప్రాంతాల్లో కూడా తక్కువ ధరలో మటన్ లభించడంతో నగరవాసులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Read also: HYD: మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా లొంగుబాటు.. పార్టీకి గట్టి షాక్

mutton is available for just Rs. 550 per kg
చికెన్ ధరలు షాక్.. పండుగ సీజన్‌లో మరింత పెరిగే ఛాన్స్
మటన్ ధరలు కొంతమేర తగ్గిన చోట సంతోషం కనిపిస్తున్నా, చికెన్ ధరలు మాత్రం సామాన్యులకు భారంగా మారాయి. హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.310కు చేరింది. చలికాలం ప్రభావంతో కోళ్ల ఉత్పత్తి తగ్గడం, సంక్రాంతి పండుగ సమీపించడంతో డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరిగినట్లు వ్యాపారులు వివరిస్తున్నారు. వరంగల్, గుంటూరు వంటి నగరాల్లో కూడా చికెన్ ధరలు రూ.300 మార్క్‌ను తాకాయి. కోడిగుడ్డు ధర కూడా ఒక్కోటి రూ.8 వరకు పలుకుతోంది. పండుగ సీజన్ నేపథ్యంలో రానున్న రోజుల్లో మటన్, చికెన్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ అంబర్‌పేట్ వంటి మార్కెట్లు మాంసం ప్రియులకు పెద్ద ఊరటనిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: