ఇటీవల ఆన్లైన్ మోసాలు (Online scams) ఎక్కువ అవుతున్నాయి. ఫేక్ ఖాతాలతో ప్రజల్ని మోసగిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. అయితే ఈమధ్య సైబర్ నేరగాళ్లు కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. సెలబ్రిటీలు, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లతో నకిలీ ఖాతాలను స సృష్టిస్తున్నారు. వారి పేరుతో డబ్బును డిమాండ్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ పేరుతో నకిలీ ఖాతాలతో ప్రజలను మోసగించే మెసేజ్ లను పంపుతున్నారు.
Read Also: Nara Lokesh: AI పై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

అవన్నీ ఫేక్ మెసేజ్ లే: సజ్జనార్
తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ ఖాతా సృష్టించారని హైదరాబాద్ (HYD) నగర సీపీ సజ్జనార్ (Sajjanar) తెలిపారు. ఆపదలో ఉన్నానని.. డబ్బులు పంపాలని మోసపూరిత మెసేజ్ లు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఓ స్నేహితుడు నిజమని నమ్మి రూ.20వేలు పంపిమోసపోయారని చెప్పారు.
డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్ లను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద లింక్ లు, మెసేజ్ లు, వీడియో కాల్స్ వస్తే బ్లాక్ చేయాలని సూచించారు. ఆయా సైట్లు బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ మోసాలపై 1930 హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: