ఇటీవల కాలంలో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు. పిల్లలు, యువత మరీ సున్నితంగా తయారవుతున్నారు. సెల్ ఫోన్ కొన్విలేదని ఒకరు, బైక్ కొన్విలేదని మరో యువకుడు, చదువుకోమన్నందుకు కోపం, మార్కులు తీక్కువ వచ్చాయని ఇలా ప్రతి చిన్న సమస్యలు, కష్టాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
Read Also: MLC Mahesh Kumar: బిసి రిజర్వేషన్ ను అడ్డుకొంటున్న బిజెపి
జీవితం ఎంతో అమూల్యమైనది. విలువైనది కూడా. దేవుడు ప్రతి ఒక్కరిపట్ల గొప్ప ఉద్దేశంతోనే మనల్ని ఈలోకానికి పంపాడు. ఒక వ్యక్తి ఆత్మహత్య సమాజంపై దాని ప్రభావం చాలా ఉంటుంది. కనిపెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు కడుపుకోతను మిగ్చుతున్నారు.

ఇంట్లో ఎవరు లేని సమయంలో సూసైడ్ నిర్ణయం
హైదరాబాద్-జీడిమెట్ల (HYD Crime) పోలీస్ స్టేషన్ (Police station) పరిధిలోని సుభాష్ నగర్ ప్రాంతంలో 11ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో బాలుడు ఉరి వేసుకుని మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, విచారిస్తున్నారు. చిన్న వయసులో బాలుడు ఎందుకు ఈ నిర్ణయంతీసుకున్నాడో విచారణలోనే తెలుస్తుంది. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమస్య ఏదైనా ఉంటే తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు చెప్పుకోవాలి. చదువు ఒత్తిడి కావచ్చు మరోకట కావచ్చు. జీవితం కంటే ఏమీ ముఖ్యమైనది కాదు. బతికేందుకే మనం చదువు, ఉద్యోగం అనేది గుర్తుంచుకోవాలి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: