దీపావళి పండగకు ముందు కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో టపాసులు(Fireworks) వేస్తారు. ఇది పండుగ ఆనందాన్ని పెంచినా, గాలి కాలుష్యాన్ని తీవ్రముగా పెంచుతుంది. దీపావళి ముగిసిన వెంటనే నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్( HYD AQI INDEX) 338గా నమోదైందని సెంట్రల్ పుల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) లైవ్ రిపోర్ట్ వెల్లడించింది.
Read Also: Chrome Update: క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక

సాధారణ రోజుల్లో మితమైన (Moderate) స్థాయిలో ఉండే గాలి నాణ్యత, ( HYD AQI INDEX)దీపావళి బాణాసంచా కాలుష్యంతో అనారోగ్యకరమైన స్థాయికి చేరింది. గాలి నాణ్యత 150–200లోనప్పుడు మాత్రమే చాలా అనారోగ్యకరంగా పరిగణిస్తారు. AQI 338 స్థాయి అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రధాన కాలుష్యకారకాలు:
- టపాసుల ద్వారా గాలిలో PM 2.5 స్థాయిలు పెరుగుతాయి.
- ఇవి ఊపిరితిత్తులలోకి, రక్తంలోకి సులువుగా చేరి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
- దీపావళి తర్వాత గాలిలో PM 2.5 స్థాయి WHO సిఫార్సు పరిమితి కంటే చాలా ఎక్కువగా నమోదైంది.
ఆరోగ్య ప్రభావాలు
ఇలాంటి కాలుష్య గాలి శ్వాసకోశ సమస్యలు కలిగించే ప్రమాదం కలిగిస్తుంది, ముఖ్యంగా:
- ఆస్తమా, బ్రాంకైటిస్
- గుండె సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల క్యాన్సర్
- కళ్ళు మండడం, గొంతు నొప్పి, దగ్గు
జాగ్రత్తలు
- గాలి నాణ్యత మెరుగయ్యే వరకు ఎక్కువగా బయటకు వెళ్ళవద్దు.
- చిన్న పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి.
- బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించండి.
- ఇంట్లో కాలుష్య ప్రభావం తగ్గించడానికి కిటికీలు, తలుపులు మూసి ఉంచండి.
దీపావళి తర్వాత హైదరాబాద్‌లో AQI స్థాయి ఎంతగా పెరిగింది?
AQI 338గా నమోదైందని CPCB లైవ్ రిపోర్ట్ తెలిపింది.
ఈ స్థాయి ప్రమాదకరమా?
అవును, 150–200 వరకు అనారోగ్యకరమైన స్థాయిగా పరిగణిస్తే, 338 అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: