హైదరాబాద్‌లో ఇవాళ కూడా భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఒక్కసారిగా కమ్ముకున్న మేఘాలతో అల్వాల్, బోయిన్ పల్లి మీదుగా వర్షం మొదలైంది. అలా సికింద్రాబాద్, అమీర్ పేట, పంజాగుట్ట, మాదాపూర్, మణికొండ ప్రాంతాలకు విస్తరించింది. ఇటు రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట్, నాచారంతో పాటు కోఠి, బేగం బజార్, నారాయణ గూడ, హిమాయత్ నగర్లో భారీ వర్షం పడుతోంది.





