TG Apply for Ganesh Permission : గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా, పారదర్శకంగా మరియు భద్రతతో నిర్వహించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఆన్‌లైన్ వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర పోలీస్ ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర పోలీసులు గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులకు ముఖ్య సూచనలు చేశారు. రాష్ట్రంలో గణేశ్ మండపాలు (pandals) ఏర్పాటుచేయాలనుకునే నిర్వాహకులు TG Apply for Ganesh Permission తప్పనిసరిగా ganeshutsav.net పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో పోలీస్ అనుమతికి దరఖాస్తు చేయాలని తెలిపారు.
ఈ అనుమతి పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుందని తెలిపారు.
దరఖాస్తు చేసిన తరువాత సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) మండపాన్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం QR కోడ్‌తో కూడిన NOC (No Objection Certificate) జారీ చేస్తారు.
Read also :